టాలీవుడ్ సినిమా నుంచి ఈ ఏడాది వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ ల్లో మొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “హను మాన్” కూడా ఒకటి. ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా యంగ్ హీరో తేజ సజ్జ అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ కెరీర్ లోనే మాసివ్ హిట్ గా నిలిచి సంక్రాంతి హిస్టరీ లోనే హిస్టారికల్ గ్రాసర్ గా నిలిచింది.
మరి ఈ మూవీ రిలీజ్ అయ్యాక అన్ని అంచనాలు రీచ్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ యూఎస్ మార్కెట్ లో కూడా వండర్స్ ని సెట్ చేసింది. మరి ఈ మూవీ యూఎస్ మార్కెట్ కు సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం యూఎస్ లో 44 కోట్ల భారీ గ్రాస్ తో హను మాన్ ఫైనల్ రన్ ను కంప్లీట్ చేసుకుందట.
5.312 మిలియన్ డాలర్స్ ని ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ వెర్షన్స్ ద్వారా అందుకొని ఇప్పుడు టోటల్ యూఎస్ రన్ ను పూర్తి చేసుకున్నట్టుగా టాక్. మొత్తానికి అయితే టాలీవుడ్ నుంచి ఈ మూవీ ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలుస్తుందని కూడా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. కానీ అసాధ్యం అనుకున్న ఫీట్స్ ను ఈ మూవీ చాలానే చేసింది.