హ్యాపీ బర్త్ డే రౌడీ స్టార్

అర్జున్డ్ రెడ్డి సినిమాతో అనతికాలంలోనో అత్యంత ప్రజాదరణ పొందిన హీరో విజయ్ దేవరకొండ. ముఖ్యంగా తనదైన యాటిట్యూడ్ తో యువతను ఆకట్టుకొనేలా దూసుకుపోతున్నాడు ఈ రౌడీ హీరో విజయ్. రౌడీ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటోన్న ఈ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు ఈరోజు. గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ మరో విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన టాక్సీ వాలా సినిమా కూడా మంచి ఆదరణను పెంచిందనే చెప్పాలి.

అయితే నువ్విలా అనే సినిమాతో పరిచయమైన విజయ్ కు పెళ్లి చూపులు సినిమా మంచి విజయాన్ని అందించింది. సోలో హీరోగా నటించిన పెళ్లిచూపులు సినిమా విజయం సాధించిన తర్వాత అర్జున్ రెడ్డితో రెచ్చిపోయి రౌడీగా మారి.. యువతకు దగ్గర్యయాడు. ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు ఈ రౌడీ. ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ యాటిట్యూడ్ కి పూరి డైనమిక్ డైరెక్షన్ తోడుగా నిలిస్తే.. ఇక అభిమానులకు పండగే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

అసలు టాలీవుడ్ యూత్ ఐకాన్ గా విజయ్ యువతలో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. అర్జున్ రెడ్డి చిత్రంతో నేష‌న‌ల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నా.. ఆ తర్వాత ఐదారు సినిమాలు అంతగా రాణించలేదు. అయినప్పటికీ విజ‌య్ దేవరకొండకి ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది. మంచి సామాజిక స్పృహ ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల‌తో పాటు సామాజిక సేవ‌తోను అభిమానుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. ఈ రోజు విజ‌య్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానులు#HBDVijayDeverakonda హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ టాప్‌లో నిలవడం విశేషం. హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ.