నేడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 77వ పుట్టినరోజు.. 1946 డిసెంబర్ 9న ఇటలీలో ఆమె జన్మించారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్న తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. సోనియా గాంధీ మొదట్లో క్రియాశీల రాజకీయలకు దూరంగా ఉన్నప్ప టికీ.. ఆ తర్వాత సోనియా గాంధీ భార్త మరణం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అత్యధిక కాలం పని చేసిన సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో గత కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
కాగా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోనియా గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ సోనియా గాంధీకి ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. ట్విట్టర్ పోస్టులో.. ‘శ్రీమతి సోనియా గాంధీజీ మీరు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నాను అంటూ ప్రధాని మోడీ రాసుకొచ్చారు. ఇక, సోనియా గాంధీకి రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.