హైబ్రీడ్ పిల్లకు జన్మదిన శుభాకాంక్షలు

టాలీవుడ్ లో తొలిసినిమాతోనే తెలుగమ్మాయిలా ఒదిగిపోయిన ముద్దుగుమ్మ సాయిపల్లవి. ‘భానుమతి,.. ఒక్కటే పీస్.. రెండు కులాలు.. రెండు.. మతాలు.. హైబ్రీడ్ పిల్ల’ అంటూ ఫిదా చేసేసింది. 2015లో ప్రేమమ్ తర్వాత ఫిదా చేసి తెలుగుపిల్లలా ఒదిగిపోయింది. మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడిపడి లేచె మనసు వంటి చిత్రాలలో అలరించింది.

ముఖ్యంగా ముక్కు సూటి త‌త్వం సాయి ప‌ల్ల‌వి నైజం. పురుషాధిక్య ఈగోయిస్టిక్ ప్ర‌పంచంలో అలాంటి భామ‌లు రాణించ‌డం అంటే క‌ష్ట‌మే. కానీ.. ఆ ఫీట్‌ని స‌క్సెస్‌ఫుల్‌గా తన స్వీయ ప్ర‌తిభ‌తో వెన‌క్కి నెట్టేయ‌గ‌లిగింది. త‌న ప్ర‌తిభ‌కు ఎదురే లేద‌ని నిరూపించింది. తొలి ప్ర‌య‌త్న‌మే ప్రేమ‌మ్ సినిమాతో ఆక‌ట్టుకున్న ఈ భామ‌.. ఆ తర్వాత `ఫిదా` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌లో మిస్మరైజ్ చేసింది.

ఆ సినిమాలో నైజాం యాస‌తో సాయిప‌ల్ల‌వి న‌ట‌నకు జనం మైమ‌రచి పోయారు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. కాగా సాయిపల్లవి ఈ రోజు తన 28వ పుట్టిన రోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న ‘విరాట పర్వం’ లో తన లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో సాయి పల్లవి ఎరుపు రంగు డ్రెస్‌లో స్థూపం దగ్గర ఓ సాధారణ అమ్మాయిలా కూర్చోని ఉంది. ఈ సినిమాను వేణు ఊడుగుల (నీది నాది ఒకే కథ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్నాడు. రానా హీరోగా చేస్తున్నారు.

అయితే తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్‌ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా ఈ సినిమా వస్తోంది. రానా రాజకీయ నాయకుడిగా, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనుంది అని తెలుస్తోంది. ‘విరాటపర్వం’ పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోంది. సినిమా ప్రధానంగా పొలిటికల్‌ థ్రిల్లర్ అయినా మాస్ ఎలిమెంట్స్ కూడా చాలా ఆసక్తికరంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారని టాక్. ఈ సినిమాలో రానా పాత్ర పాజిటివ్ ఆటీట్యూడ్‌తో పాటు కొంత నెగిటివ్ యాంగిల్ కూడా ఉంటుందని సమాచారం.

ఇంకా మంచి కోసం పోరాడే ఓ చెడ్డ వాడి కథే ఈ విరాట పర్వం. దీనికి తోడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఓ న్యూ యాంగిల్ లో దర్శకుడు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కథ ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని 1980-1990లో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారంగా చేసుకొని రూపుదిద్దుకుంటుంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిస్తున్నారట. విరాటపర్వంను అటూ హిందీ, తమిళ భాష‌ల్లోనూ రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో సాగే ఈ కథలో రానా నక్సలైట్ గా నటిస్తుండగా.. సాయి పల్లవి జానపద గాయని పాత్రలో నటిస్తోంది.

అసలు సాయి ప‌ల్ల‌వి ఏం చేసినా చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. విల‌క్ష‌ణ‌త‌ ఉట్టిపడుతుంది. తన న‌టనతో ప్రేక్షకాళి హృద‌యాల‌ను దోచేస్తుంది ఈ ఫిదా బ్యూటీ. ప్రేమ‌మ్‌, ఫిదా చిత్రాల‌తో ఈ భామ కెరీర్ స్కైని ట‌చ్ చేయ‌డానికి కార‌ణం త‌న‌లో ఏదో సంథింగ్ ఉంద‌నే కోణ‌మే. ముఖ్యంగా `ఫిదా` విజ‌యంలో సాయిప‌ల్ల‌వికే ఎక్కువ క్రెడిట్ ద‌క్కింది. ఈ భామ అచ్చం తెలంగాణ‌ అమ్మాయిలాగా క‌నిపించింది. అంత‌కుమించి ఆ నైజాం యాస అలా సెట్ట‌యిపోయింది. దాంతో ఎక్క‌డా లేని క్రేజు వ‌చ్చింది. ఆ క్ర‌మంలోనే వ‌రుస‌గా తెలుగు-త‌మిళ‌ సినిమాల‌కు సంత‌కాలు చేసింది. ఇప్ప‌టికిప్పుడు క్ష‌ణం తీరిక లేనంత బిజీగా కెరీర్‌ని సాగిస్తోంది ఈ అమిత ట్యాలెంటెడ్ గాళ్‌ సాయిపల్లవి. సో హ్యాపీ బర్త్ డే సాయిపల్లవి.