హ్యాపీ బర్త్ డే to ప్రిన్సెస్ సితార..?

Sitara
Sitara

ఘట్టమనేని సితార.. ప్రస్తుతం ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సినిమాలలోకి రాకముందే భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక ఈరోజు సితార పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ వేదికగా ప్రతి ఒక్కరు సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.

మహేష్ బాబు కూతురిగా సితార ఘట్టమనేని అందరికీ పరిచయస్తురాలే.. చిన్నవయసు నుంచే నమ్రత.. సితార ఫోటోలను షేర్ చేయడంతో అందరికీ ఈమె బాగా తెలుసు. మొదటి నుంచి కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ ఉంది. ఇక డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు, తన ఫ్రెండ్ ఆధ్యా తో కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో పలు వీడియోలతో మంచి పేరు కూడా తెచ్చుకుంది.

2012 జూలై 20న జన్మించిన సితార వయసు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. ఈ వయసులోనే చాలా బాగా మాట్లాడటం, యాక్టివ్ గా ఉండడం సోషల్ మీడియా రీల్స్, యూట్యూబ్ వీడియోలు ఇప్పుడు యాడ్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది..

చదువుతోపాటు అన్నిటిలో పాటిస్పేట్ చేస్తూ మరింత దూసుకుపోతున్న సితార ఒకపక్క సాంప్రదాయ నృత్యం నేర్చుకుంటూ.. మరొక పక్క క్లాసికల్ , ఫోక్ డాన్స్ తో అలరిస్తోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో ఒక ప్రమోషన్ లో డాన్స్ వేసి ప్రేక్షకులను అలరించిన ఈమె ఇప్పుడు సింగిల్ గా ఒక కమర్షియల్ యాడ్ కూడా చేసింది.పి ఎం జె జ్యువెలరీ సంస్థకు సితార యాడ్ చేయడం జరిగింది. ఆ సంస్థ సితార కలెక్షన్స్ అంటూ నగల్లో స్పెషల్ కలెక్షన్స్ కూడా రిలీజ్ చేసింది ..

అంతేకాదు ఈ కమర్షియల్ యాడ్ కు సంబంధించిన ఫోటోలను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కూడా ప్రదర్శించారు. అంతేకాదు ఈ కమర్షియల్ యాడ్ ద్వారా సంపాదించిన డబ్బును చారిటీ సంస్థకు విరాళంగా ఇచ్చింది సితార.అలాగే గతంలో కూడా తన తండ్రి ఇచ్చే పాకెట్ మనీని కూడా ఆమె మహేష్ బాబు ఫౌండేషన్ కి ఇచ్చినట్లు సమాచారం..