సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ బాగా అలరిస్తోంది ‘జెండర్ స్వాప్’ ఫేస్ యాప్. ఈ యాప్ ద్వారా ఆడవారు మగవారిగా, మగవారు ఆడవారిగా మారితే వారు ఎలా ఉంటారో అంచనా వేయవచ్చు. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు ఈ యాప్‌ను ఉపయోగించి పలు ఫోటోలతో అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే యజేంద్ర చహల్, యువరాజ్ సింగ్‌లు సహచర క్రికెటర్లను జెండర్ స్వాప్లో మహిళలుగా మార్చిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇక యువీ ఓ అడుగు ముందుకేసి ‘ఇందులో మీరు ఎవరిని గర్ల్‌ఫ్రెండ్‌గా ఎంచుకుంటారు’ అని ప్రశ్నించారు. దీంతో నెటిజన్లు, సహచర క్రికెటర్లు ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్ చేశారు.
తాజాగా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా యువీ బాట పట్టారు. యువీ ప్రస్తుత టీమిండియా క్రికెటర్ల జెండర్ స్వాప్ ఫోటోలను షేర్ చేయగా.. భజ్జీ గతంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల జెండర్ స్వాప్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాకుండా ఇందులో ఉన్న వారిలో ఎవరితో డేట్‌కు వెళతారు అని హర్భజన్ సరదాగా ప్రశ్నించారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, నెహ్రా, జహీర్ ఖాన్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యువీ, గంభీర్‌లు ఉన్నారు. అయితే భజ్జీ పోస్ట్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. కళ్లద్దాలతో మధ్యలో ఉన్న అమ్మాయితో డేట్‌కు వెళతానని దాదా సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం భజ్జీ చేసిన పోస్ట్, దాదా కామెంట్‌కు సంబంధించిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.