హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండర్

హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండర్

గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను బిట్స్‌ అండ్‌ పీసెస్‌ క్రికెటర్‌ అని విమర్శించి అభిమానుల ఆగ్రహానికి గురైన కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌.. మరొకసారి నోరు జారాడు. మళ్లీ రవీంద్ర జడేజానే టార్గెట్‌ చేస్తూ మాట్లాడిన మంజ్రేకర్‌.. అతనితో తనకు వ్యక్తిగతం ఎటువంటి ఇబ్బందీ లేదన్నాడు. కానీ ఒక క్రమశిక్షణ అంటూ తెలియని జడేజా లాంటి క్రికెటర్లతోనే తనకు ప్రాబ్లమ్‌ అని విమర్శిలకు దిగాడు. రెండు రోజుల క్రితం ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ.. తన సెలక్షన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుందో చెప్పాడు. టీమిండియా సెలక్షన్‌లో మంజ్రేకర్‌ సభ్యుడిగా పని చేసిన అనుభవం లేకపోయినప్పటికీ సెలక్షనలో్ ఆటగాళ్ల క్రమశిక్షణకు పెద్ద పీట వేయాలన్నాడు.

తానైతే క్రమశిక్షణ ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేస్తానన్నాడు. తాను గత కొన్నేళ్లుగా నేర్చుకున్న కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడే క్రికెటర్లను ఎంపిక చేస్తానన్నాడు. ఎవరైతే క్రమశిక్షణలో స్పెషలిస్టులుగా ఉంటారో వారితోనే జట్టును భర్తీ చేయాలన్నాడు. తనకు జడేజాతో ఎటువంటి సమస్యలు లేవని, కానీ వైట్‌బాల్‌ క్రికెట్‌లో మాత్రం ఆ తరహా క్రికెటర్లతోనే తనకు సమస్య అని అన్నాడు. తన జట్టులో ఆఖరికి హార్దిక్‌ పాండ్యా లాంటి ఆల్‌రౌండర్‌ను ఎంపిక చేయనన్నాడు. ఆ తరహా క్రికెటర్లు భ్రమను కల్పించే వారు మాత్రమేనన్నాడు. తాను జడేజాను టెస్టు క్రికెటర్‌గా మాత్రమే భావిస్తానని, లాంగెస్ట్‌ ఫార్మాట్‌లో మాత్రం అతనికి ఫుల్‌ మార్క్స్‌ వేస్తానని చెప్పుకొచ్చాడు.