ముంబై ఇన్నింగ్స్‌కు శుభారంభం

ముంబై ఇన్నింగ్స్‌కు శుభారంభం

రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 196 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ క్వింటాన్‌ డీకాక్‌(6) విఫలమయ్యాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో డీకాక్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు ఆకట్టుకున్నారు. ఈ జోడి 83 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత ఇషాన్‌ కిషన్‌(37; 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. కార్తీక్‌ త్యాగి వేసిన 11 ఓవర్‌ నాల్గో బంతికి ఆర్చర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇసన్‌ ఔటయ్యాడు.

దాంతో 90 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్‌గా కోల్పోగా, మరో ఐదు పరుగుల వ్యవధిలో సూర్యకుమార్‌(40; 26 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) వికెట్‌ను కోల్పోయింది. శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 13 ఓవర్‌ రెండో బంతికి షాట్‌ ఆడిన సూర్యకుమార్‌.. స్టోక్స్‌ క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌ చేరాడు. పొలార్డ్‌(6) నిరాశపరిచాడు. చివరి ఓవర్లలో సౌరవ్‌ తివారీ(34; 25 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా(60 నాటౌట్‌; 21 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు)లు బ్యాట్‌ ఝుళిపించడంతో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది.