తమిళంలో తాజాగా విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘96’ చిత్రాన్ని రీమేక్ చేయడానికి దిల్‌రాజు ఇప్పటికే హక్కులను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిషను కూడా ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించే భాద్యతను హరీష్ శంకర్ చేతిలో పెట్టాడు. ఎలాగు రీమేక్ చిత్రాలను తెరకెక్కించడంలో హరీష్ శంకర్‌కు ఉన్న నైపుణ్యం అందరికి తెల్సిందే. దాంతో కోలీవుడ్‌లో కలెక్షన్ల వరద పారిస్తున్న ఈ చిత్ర చిత్రీకరణను హరీష్ శంకర్‌కు అప్పగించాడు.
దిల్‌రాజు,హరీష్ శంకర్ల కాంభోలో ఇప్పటికే పలు చిత్రాలు విడుదలయ్యాయి. ఆ చిత్రాలు పర్వాలేదు అనే టాక్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే ఇద్దరి కాంభోలో సూపర్ హిట్ చిత్రాలేమి లేకున్నా కూడా ‘96’ కథపై ఉన్న నమ్మకంతో ఈ ఆఫర్ హరీష్ శంకర్ చేతికి వెళ్లింది. అయితే హరీష్ శంకర్ ఈ చిత్రానికి ఇంకా గ్రీన్ ఇవ్వలేదు. హరీష్ శంకర్‌కు కూడా ప్రస్తుతం చెప్పుకోదగ్గ విజయాలేవి లేవు కాబట్టి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తీసుకుంటాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో హీరో ఎవరు అనేది ఇంకా తెలియదు. హీరోది మధ్య వయస్సు పాత్ర కాబట్టి దిల్‌రాజు అందుకు తగ్గ హీరోని ఎంపిక చేసే పనిలో పడ్డారు.