ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్ల తీసిన రికార్డు చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్‌లో బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. కాగా ప్రస్తుతం ఈ సీజన్‌లో హర్షల్ ఖాతాలో 30 వికెట్లు ఉన్నాయి.
నేడు కోల్‌కతాతో జరగనున్న మ్యాచ్‌లో మరో రెండు వికెట్లు సాధిస్తే ఆ ఘనత అతడి సొంతమవుతుంది.ఇప్పటికే ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచిన సంగతి తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.