దీప్తి సునైనా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు . బిగ్ బాస్ తర్వాత దీప్తి క్రేజ్ బాగా పెరిగింది. సోషల్ మీడియాతో క్రియేట్ తెచ్చుకున్న దీప్తి బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి వచ్చిన తర్వాత అమాంతం తన క్రేజ్ ని బాగా పెంచుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్యూట్ నెస్ తో అందరి మనసుల్ని గెలుచుకుంటూ ఉంది . దీప్తి షణ్ముఖ్ ప్రేమించుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే వీళ్ళు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు.
అప్పుడు కూడా సోషల్ మీడియాలో వీళ్ళపై వార్తలు ఎక్కువగానే వచ్చాయి . ఎవరి లైఫ్ ను వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రస్తుతం దీప్తి ప్రైవేట్ సాంగ్ చేయడంతో పాటుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా చీర కట్టుకుని ఫోటోలు పంచుకుంది. నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా అనే క్యాప్షన్ పెట్టింది . ఇది చూసి నెటిజన్లు ఈమె మళ్ళి ప్రేమలో పడిందని అంటున్నారు.