Election Updates: జనసేనకు రూ.10 కోట్ల విరాళం అందించిన పవన్ కల్యాణ్

Election Updates: What was the purpose of the trip when there was no electricity? Pawan Kalyan
Election Updates: What was the purpose of the trip when there was no electricity? Pawan Kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఆ పార్టీ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు. మంగళవారం ఆయన.. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో కోశాధికారి ఏవీ.రత్నానికి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. ‘స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారు.

ఆ రోజుల్లో తమ సొంత డబ్బును వెచ్చించిన తీరు గొప్పది. ఓ సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న ప్రయాణానికి నా వంతుగా రూ.10 కోట్లను అందిస్తున్నాను. ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సగటు కూలీ తన సంపాదనలో రోజూ రూ.100 చొప్పున విరాళం ఇచ్చి పార్టీ ఎదుగుదలకు తోడ్పడుతున్నారు. ఓ మేస్త్రీ రూ.లక్ష విరాళం అందించారు. మరికొందరు తమ పింఛనులో కొంతభాగం పంపుతున్నారు. అలాంటి వారి స్ఫూర్తితో సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని పార్టీ కోసం అందించడం చాలా సంతోషంగా ఉంది’ అని పేర్కొన్నారు.