మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడ్డారా?

మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడ్డారా?
Cinema News

సీతారామం మూవీ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను సీత గానే గుర్తుపెట్టుకున్నారు సీత గానే ఆరాధిస్తున్నారు. కానీ ఆమె మాత్రం సోషల్ మీడియాలో పూర్తి భిన్నంగా ప్రవర్తిస్తోందని చెప్పుకోవాలి . ఇది ఇలా ఉండగా..ఈ బ్యూటీ ఇటీవల డేటింగ్ పుకార్లతో పదేపదే వార్తలలో బాగా నిలుస్తున్నారు.

మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడ్డారా?
Bad shah and mrunal thakoor

తాజాగా ఆమె మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చారు. దీపాలు సందర్భంగా మృనాల్ ఠాకూర్ సింగర్ బాద్ షా తో కలిసి కెమెరాకు చిక్కారు. ఇందులో ఇద్దరు శిల్పా శెట్టి ఇంట్లో వేడుకల్లో పాల్గొన్నారు. అయితే పార్టీ పూర్తి అయిన తర్వాత ఇద్దరు చేతిలో చేయి వేసుకొని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై హీరోయిన్ మృనాల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.