“డాకు మహారాజ్ రన్ టైమ్ పై క్లారిటీ వచ్చిందా?”

"Has there been any clarity on the run time of Daku Maharaj?"
"Has there been any clarity on the run time of Daku Maharaj?"

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన సాలిడ్ మాస్ సినిమా “డాకు మహారాజ్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యి ఇపుడు శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టుకుంటుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు దగ్గరకి వస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ కి సాలిడ్ రన్ టైం లాక్ చేసినట్టుగా బజ్ వినిపిస్తుంది.

"Has there been any clarity on the run time of Daku Maharaj?"
“Has there been any clarity on the run time of Daku Maharaj?”

దీని ప్రకారం డాకు మహారాజ్ 2 గంటల 45 నిమిషాల మేర కట్ తో థియేటర్స్ లో ట్రీట్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. అల్రెడీ మూవీ ని బాబీ నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించారు అంటూ టాక్ ఉంది. మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనేది. ఇక ఈ సినిమా కి థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మూవీ రిలీజ్ కి రాబోతుంది.