వరంగల్ జిల్లా హన్మకొండ టైలర్స్ కాలనీలో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడు ప్రవీణ్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రవీణ్ ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారి హత్యాచారానికి సంబంధించిన కేసులో రిమాండ్ రిపోర్టు సిద్ధం చేసిన వరంగల్ పోలీసులు నిందితుడికి సంబంధించి ఎన్నో విస్తుపోయే విషయాలు అందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ నరరూప రాక్షసుడని, అతడొక సెక్స్మానియాక్గా మారాడని రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. ప్రవీణ్ సెక్స్ సైకో అని అర్ధరాత్రి ఆడవాళ్లు అతడి కంట పడితే వదిలిపెట్టేవాడు కాదని చెబుతున్నారు. ప్రవీణ్ అఘాయిత్యానికి సంబంధించిన ఓ వీడియో పోలీసులు సేకరించారు. ఆరు బయట నిద్రించే ఆడవాళ్లే ప్రవీణ్ టార్గెట్ అని, ఎవరైనా నిద్రిస్తున్న మహిళలు కనిపిస్తే వెంట తెచ్చుకున్న సిరంజీతో వారిపై నీళ్లు జల్లేవాడని, దీంతో ఆ మహిళలు దుస్తులు దులుపుకుంటే వాటిని వీడియో తీసి చూసేవాడని పోలీసులు చెబుతున్నారు. బయట ఆరేసిన మహిళల దుస్తుల వాసన చూసి ప్రవీణ్ మత్తెక్కిపోయేవాడని, అతడికి ఫిడోఫిలియా అనే మానసిక వ్యాధి ఉందని పోలీసులు రిపోర్టులో పేర్కొన్నట్లుగా సంబంధిత వర్గాల సమాచారం. ప్రవీణ్‌కు సెక్స్ కోరికలు కలిగినప్పుడు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని, అవకాశం దొరికితే వాళ్లపై అత్యాచారం చేసేవాడని పోలీసులు చెబున్నారు. ప్రవీణ్ గతంలో అనేక అఘాయిత్యాలకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని, బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే అతడిపై మరిన్ని కేసులు నమోదు చేస్తామని పోలీసులు సూచిస్తున్నారు.