ఏం జరిగినా మెగాస్టారే.. హ్యాపీబర్త్‌డే చిరు…!

The King Of Records Is Megastar Chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి టాలీవుడ్‌లో దాదాపు రెండు దశాబ్దాల పాటు నెం.1 స్థానంలో నిలిచాడు. చిరంజీవి ఏ చిత్రం చేసినా, ఎలాంటి సినిమాలో నటించినా కూడా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. చిరంజీవి చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిసింది. అలాంటి సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చిరంజీవి కొందరి వాడు అయ్యాడు. తనను సినిమా వాడిగానే జనాలు చూడాలనుకుంటున్నారు అని భావించిన చిరంజీవి దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్లీ ఖైదీ నెం.150 చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. రీ ఎంట్రీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. చాలా కాలం తర్వాత వచ్చాడు కనుక చిరంజీవి రీ ఎంట్రీ మూవీకి కలెక్షన్స్‌ వచ్చాయి, కాని చిరంజీవికి అంత లేదు అనుకున్నారు.

cheranjeevi

చిరంజీవి ఎన్నాళ్ల తర్వాత వచ్చినా, మద్యలో ఎన్నో జరిగినా కూడా ప్రేక్షకులు మాత్రం చిరంజీవికి బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. ఖైదీ నెం.150 చిత్రం తర్వాత కూడా చిరంజీవి చేస్తున్న సినిమాపై అంచనాలు పెంచుకుంటున్నారు. చిరంజీవి మూవీ అంటే గతంలో చూసినంత ఆతృతగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల తరం మారినా కూడా చిరంజీవి మూవీ కోసం కొత్త తరం వారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సినిమా సైరాకు దక్కుతున్న క్రేజ్‌ను చూస్తుంటే చిరంజీవి మళ్లీ ఏ రేంజ్‌కు వెళ్లాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పది సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా చిరంజీవి మళ్లీ నెం.1గానే నిల్చున్నాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ స్టార్‌డం మరెవ్వరికి సాధ్యం కాదు. ఇంతటి మెగాస్టార్‌ టాలీవుడ్‌లో మళ్లీ ఎప్పుడు రాకపోవచ్చు. రికార్డుల రారాజు మెగాస్టార్‌ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

cheranjeevi