ఏ పండు తింటే ఏ లాభం…

health benefits of fruits list

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా… సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్నా… అందరూ ముందుగా సూచించేవి తాజాపండ్లు. రోజూ పండ్లు తినండి ఆరోగ్యంగా ఉండండి అని చెబుతూ ఉంటారు. అన్ని రకాల పళ్లు మంచివే అని సూచిస్తుంటారు. తాజా పండ్లని తినటానికి ఎవరైన ఇష్టపడతారు. పండ్లని సలాడ్’గా, జ్యూస్’గా, రసాయనిక ద్రావాలుగా తీసుకుంటారు. పండ్లని ఎక్కువగా తీసుకోవటం వలన ఆరోగ్యంగా ఉంటాము. తాజా పండ్లు నిత్యం తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, సరైన విటమిన్స్ అందుతాయి.

పండ్లు శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అందుకే అందరూ పండ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఏ పండ్లలో ఏమున్నాయో తెలుసా ? ఎలాంటి పండ్లు… ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయో తెలుసా ? ఏ పండులో ఏముందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

ఆపిల్ పురాతన సామెత చెప్పినట్టు “రోజుకి ఒక ఆపిల్ డాక్టర్ కి దూరంగా ఉంచుతుంది” అని అందరికి తెలిసిన నిజమే. రక్త ప్రసరణ వ్యవస్థలో నెమ్మదిగా చక్కెర స్థాయిలను విడుదల చేయటం వల్ల రక్తంలో ‘ఇన్సులిన్’ స్థాయిలను నియంత్రిస్తుంది. ఆపిల్ ఎక్కువగా ఫైబర్’ని కలిగి ఉండటం వలన శరీర బరువును సమన్వయపరుస్తుంది. అలాగే కొలెస్ట్రాల్‌ను తగ్గించగల పీచుపదార్థం యాపిల్స్‌లో ఎక్కువగా లభిస్తాయి. రోజుకు అవసరమైన పీచులో నలభై శాతం ఈ పండ్ల నుంచి లభిస్తుంది. పీచుపదార్థాలు ఎక్కువగా తినేవారిలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటుంది.

బొప్పాయి పండు: బొప్పాయి పండును దేవదూతగా అభివర్ణిస్తారు. బొప్పాయి పండు ఎక్కువగా పోషకాలను , జీర్ణక్రియ ఎంజైమ్లను, మెడిసినల్స్ ఇంకా చాలా వైద్య పరమైన కారకాలను కలిగి ఉంది.బొప్పాయిలో బీటా క్రిపొక్సాంథిన్ గుణాలు ఎక్కువగా వుంటాయి. ఇవి లంగ్ క్యాన్సర్ దరిచేరకుండా కాపాడతాయి. బొప్పాయిలోని పపెయిన్ ఎంజైమ్ కలిగి ఉండటం వలన ఇది జీర్ణశక్తికి సహకరిస్తుంది. అజీర్తితో బాధపడేవారికి బొప్పాయి దివ్యౌషధం. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి.

అరటి పండు ఏడాది పొడవునా దొరికే అరటి పండు చాలా పోషకాలని కలిగి ఉండటము వలన ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, సహజ చక్కెరలు తక్షణం శరీరానికి అందుతాయి. అరటిపండులో పీచు పదార్థాల మోతాదు కూడా ఎక్కువగా వుంటుంది. అరటి పండు తినటం వలన రక్తపోటును తగ్గించే పొటాషియం అత్తి, అరటిపండ్లలో లభిస్తుంది. అంతే కాకుండా హృదయ స్పందలను నియంత్రిస్తూ, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మామిడి పండు: మామిడి పండు రుచికరంగానే కాకుండా, ఆరోగ్యకరమైన ఉపయోగాలను కలిగి ఉండటం వలన దీన్ని ‘కింగ్ అఫ్ ఫ్రూట్స్’గా అభివర్ణిస్తారు. ఇది క్వేర్సిటిన్, ఐసోక్వేర్సిటిన్, ఆస్ట్రగాలిన్ వంటి యాంటీ-ఆక్సిడెంట్స్’ని కలిగి ఉండటం వలన క్యాన్సర్ కారకాలకు వ్యతిరేఖంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కొవ్వు పదార్థాలను సరియగు పాళ్ళలో వుంచి, చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది.

గ్రేప్స్ లేదా ద్రాక్ష పండ్లు గుండె ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే… ద్రాక్ష పండ్లను తీసుకోవాలి. గ్రేప్స్ ఎక్కువగా విటమిన్ ‘A’, ‘\C’, ‘B6’ మరియు ఫోలేట్’లను కలిగి ఉండటం వలన మలబద్దకం, అలసట వంటి ముత్రపిండానికి సంబంధించిన వ్యాధులను, మాక్యులర్-డిజెనరేషణ్, అజీర్ణం వంటి వాటికి చికిత్సగా వాడతారు. ఈ రుచికరమైన పండ్లు శరీరానికి కావలసిన మినరల్స్, పొటాసియం, కాల్షియమ్, ఐరన్, పాస్పరస్, మేగ్నేషియం, మరియు సెలీనియం వంటి చాలా రకాలయిన మూలకాలను కలిగి ఉంది. ద్రాక్ష పండ్లలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పాలిపినాల్స్ అధికంగా ఉంటాయి. క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టడంలో పాలిఫినాల్స్ ఉపయోగపడతాయి.

లిచీ పండు: లిచీ పండ్లు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. థయామిన్, నియాసిన్, ఫోలేట్ వంటి పుష్కలమైన ‘B-కాంప్లెక్స్’ విటమిన్స్’ని కలిగి ఉంటుంది. శరీరంలో సులువుగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలను జీవక్రియలో ఏర్పడేలా చేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే లిచీ పండ్లు తింటూ ఉండాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది.

జామపండు (Guava) తక్కువ ధరకే దొరికే ఒక కప్పు జామపండు ముక్కల్లో లభించే విటమిన్ సి రోజువారీ అవసరాని కంటే ఐదు రెట్లు ఎక్కువ వుంటుంది. వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఇందులో విటమిన్‌ ఎ, విటమిన్‌ బి, క్యాల్షియం‌, ఫాస్పరస్‌, పొటాషియం, ఐరన్‌, ఫోలిక్‌యాసిడ్‌ వంటివి మెండుగా ఉన్నాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను నెమ్మదిగా గ్రహించేల సహాయపడుతుంది. ఎక్కువగా ఫైబర్’ని కలిగి ఉండటం వలన డయాబెటిక్ వ్యాధులకు మంచి ఆహరం. రక్త పీడనాన్ని నియంత్రించటమే కాకుండా, థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేయటానికి దోహదపడుతుంది.

పుచ్చపండు: పుచ్చపండు నమ్మలేని విధంగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. రక్త పీడనాన్ని తగ్గించటమే కాకుండా సహజ సిద్దమైన డైయురేటిక్’గా పనిచేసి శరీరంలో నీటి మట్టాన్ని సమన్వయ పరుస్తుంది. ఇది తక్కువ క్యాలోరీలను కలిగి ఉండి, మరియు పూర్తిగా కొవ్వు పదార్థాలను కలిగి ఉండదు.

నేరేడు పండు సంపూర్ణ ఆరోగ్యం కోసం… ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే మంచిది. అలా ప్రకృతి ప్రసాదితమైనది నేరేడు. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని. అనారోగ్యాల నివారణి. నేరేడు పండులో ఎక్కువగా విటమిన్లు, క్రోమియం, ఫైబర్ మరియు బీటా-కెరోటిన్’లను పుష్కలంగా కలిగి ఉండును. కంటి, గుండె వ్యాధులను తగ్గించటానికి కావలసిన మూలకాలను కలిగిఉండును. ఆరెంజ్ రంగు కలిగిన ఈ పండు LDL కొలెస్టరాల్’ను ఆక్సిడేషన్ అవకుండా ఆపును, గుండె సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది.

కమలా కాయ కమలా విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు తినే మహిళల్లో చర్మంపై ముడతలు వచ్చే అవకాశాలు మిగతా వారి కంటే తక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి కూడా కమలా పండ్ల నుంచి లభిస్తుంది.

దానిమ్మ పండు దానిమ్మ మెదడులో వాపును తగ్గించడంతో పాటు ఆల్జీమర్స్ ను నియంత్రిస్తుంది. విటమిన్ సి, కె కాకుండా రకరకాల పోషకాలతో నిండిన దానిమ్మ శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది