ఏపీలో బీజేపీ బరువు మైనస్ 14 %.

in-ap-of-alliance-with-bjp-looms-over-tdp

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రాజకీయాల్లో పార్టీల గెలుపు,ఓటముల్ని లెక్క వేయవచ్చు. వారికి వచ్చే ఓట్ల శాతాన్ని కొలవచ్చు. కానీ ఓ రాజకీయ పార్టీ భారాన్ని కొలవలేము. కానీ ఆంధ్రప్రదేశ్ ఇటు అధికార టీడీపీ, అటు విపక్ష వైసీపీ తో దాగుడుమూతలు ఆడుతున్న బీజేపీ ఎంత అదనపు బరువో తెలుసుకునే ఛాన్స్ దక్కింది. ప్రతి మూడు నెలలకి ఓ సారి మారుతున్న రాజకీయ పరిస్థితుల్ని సర్వేల ద్వారా అంచనా వేస్తున్న ఓ మాజీ పొలిటీషియన్ ఈ ఫీట్ కూడా సాధించేసాడు.

ఆంధ్రాలో టీడీపీ మిత్ర పక్షం అంటూనే ఆ పార్టీ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్న బీజేపీ కి వచ్చే ఎన్నికల్లో చుక్కలు చూపించడానికి జనం రెడీ గా ఉన్నారంట. టీడీపీ ఒంటరిగానే ఎన్నికలకి వెళితే 67 శాతం ఓట్లు వస్తే, బీజేపీ తో కలిస్తే మాత్రం 53 శాతం మాత్రమే వస్తాయట. అంటే బీజేపీ బరువు మైనస్ 14 శాతం. ఇక ఈ సర్వేలో వైసీపీ బలం ఇంతకుముందుకన్నా బాగా తగ్గిపోయినట్టు తేలిందట. గతంలో 30 శాతం వున్న వైసీపీ ఓట్ల శాతం ఈ మూడు నెలల్లో 22 శాతానికి పడిపోయిందట. ఇక పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన సైతం అనూహ్య విజయాలు సాధించలేదని తేలింది. బీజేపీ కి ఒంటరిగా పోటీ చేస్తే వచ్చేది 2 శాతం ఓట్లు మాత్రమే అట.