బీజేపీ ఆఫర్ కి దండాలు పెడుతున్న నేతలు.

Ap Political leaders shocked to BJP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
దక్షిణాదిలో బలపడదామనే ఆలోచనతో విభజన కష్టాల్లో వున్న ఆంధ్రప్రదేశ్ ని ఇంకా ఇబ్బందులు పాలు చేస్తున్న బీజేపీ కి ఊహించని షాక్ తగులుతోంది. నిన్నమొన్నటిదాకా మోడీ, అమిత్ షా ద్వయం విజయవిహారం చూసి నోరు ఎత్తడానికి కూడా భయపడ్డ పార్టీలు, నేతలు ఇప్పుడిప్పుడే నోళ్లు సవరించుకుంటున్నారు. ఉత్తరాది ఉపఎన్నికల ఫలితాల తర్వాత 2019 ఫలితాలు ఎలా వుంటాయో కొద్దికొద్దిగా అర్ధం చేసుకుంటున్న పార్టీలు కొత్త ఉత్సాహంతో బీజేపీ మీద పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. ఇక ఈ పరిస్థితిని అర్ధం చేసుకోకుండా మిగిలిన పార్టీల్లోని సీనియర్స్ కి ఆఫర్స్ పంపిస్తూనే వుంది బీజేపీ. అలా బీజేపీ చేసిన ప్రయత్నాలకు ఊహించని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎదురు దెబ్బ తగిలిందట.

ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండి వైసీపీ తో పడక రాజకీయంగా సైలెంట్ గా వున్న ఉత్తరాంధ్ర నేతల దగ్గరికి బీజేపీ హైకమాండ్ దగ్గర నుంచి దూతలు వచ్చారట. పార్టీలోకి వస్తే ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేశారట. ఆర్ధికంగా కూడా ఏ ఇబ్బందులు లేవని అన్నారట. అంతా విన్న ఆ ఇద్దరు నాయకులు మరి ఓట్లు కూడా మీరే వేస్తారా అని అడగడంతో బీజేపీ దూతలకి మైండ్ బ్లాక్ అయ్యిందట. రాజకీయ విశ్లేషణ చేయగలిగిన ఓ నేత అయితే ఇక్కడ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే 2 శాతానికి మించి ఓట్లు రావని తేల్చి చెప్పి ఓ దండం పెట్టారట. ఇంకో నేత మాత్రం ఇంత లోతుగా వెళ్లకుండా కూల్ గా సారీ అన్నారట.

అటు తెలంగాణాలో కూడా టీడీపీ, కాంగ్రెస్ లో అసంతృప్త నేతలకి గాలం వేద్దామని వెళ్లిన బీజేపీ కి ఇదే సమాధానం వచ్చిందట. ఇప్పటికీ తెలంగాణాలో బీజేపీ కన్నా ఒక్క ఓటు అయినా టీడీపీ కి వస్తుందని మరి అలాంటి పార్టీలో చేరి ఏమి చేయాలని ఓ యువ నేత ప్రశ్నించారట. అవసరం అయితే కాంగ్రెస్ కి వెళతా గానీ బీజేపీ లో చేరే ప్రసక్తే లేదన్నారట. ఈ సమాధానాలు ఏ మాత్రం ఊహించని దూతలు ఇప్పుడు హైకమాండ్ దగ్గర ఎలా చెప్పాలో అర్ధం గాక తలలు పట్టుకుంటున్నారట. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో కాంగ్రెస్ నుంచి బీజేపీ లో చేరి టీడీపీ కి వ్యతిరేకంగా ఓవర్ ఆక్షన్ చేస్తున్న నాయకులు హైకమాండ్ ముందు తలలు ఎత్తుకోలేని పరిస్థితి ఉందట.