వాస్తవానికి మీరు పుట్టిన సంవత్సరం ఆధారంగా ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి రోగ నిర్ధారణ లేదా అంచనా వేయబడదు. మీ వ్యక్తిత్వాన్ని బట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడంపై శారీరక, మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వ్యక్తులతో ఏర్పడే పరిచయం, ఆఫీసులో పనివేళలు అనేవి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వీటిని ఎప్పటికప్పుడు గమనించడం మీకు ఎంతో ముఖ్యం. ఇంటర్నెట్ కనెక్టివిటీ వచ్చిన తర్వాత జ్యోతిష్య శాస్త్రం ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండటంతో అన్ని విషయాల గురించి కూలంకుషంగా తెలుసుకునే అవకాశం లభిస్తోంది.
మేష రాశి ముఖ్యంగా తల, మెదడు, ముఖంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన మూడో కన్ను చాలా శక్తివంతంగా ఉంటుంది. ఈ రాశి చక్రం ముఖ్యంగా అంగారకుడిచే పాలించబడుతుంది. దీంతో మేషరాశి వారు ఎక్కువగా తలనొప్పి, గుండెపోటులకు దారితీసే మానసిక ఒత్తిడిని కలిగి ఉంటారు. వీరి మెదడు ఎల్లప్పుడూ విపరీతమైన ఆలోచనలను కలిగి ఉంటుంది. మేషరాశి వారు ఎక్కువగా ఒత్తిడికి గురికావడం కారణంగా జుట్టు రాలడం వంటి సవాళ్లు కూడా ఎదురవుతాయి.
వృషభ రాశి అనేది మెడ, చెవులు మరియు గొంతుతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశి చక్రం ముఖ్యంగా గొంతుపై శక్తివంతంగా ప్రభావం చూపుతుంది. దీంతో ఈ రాశి వారు ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు, ENTకి సంబంధించిన సమస్యల బారిన పడుతుంటారు. అందువల్ల వృషభరాశి గల వారికి ఎక్కువగా జలుబు, గొంతునొప్పి, చెవినొప్పి వంటి సవాళ్లు ఎదురవుతాయి. ఎందుకంటే ఈ రాశిలోని వృషభం హఠాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం వంటి థైరాయిడ్ గ్లాడ్‌తో అనుబంధం కలిగి ఉంటుంది.
మిథున రాశి ముఖ్యంగా మనిషిలోని ఊపిరితిత్తులు, భుజాలు, చేతులతో ముడిపడి ఉంటుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఊపిరితిత్తులపై శక్తివంతంగా ప్రభావం చూపుతుంది. అందువల్ల మిథున రాశి గల వారికి శ్వాస సంబంధిత సవాళ్లు ఎదురవుతాయి. వీరిలో సాధారణంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం కారణంగా జ్వరం, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. వీరి నాడీ వ్యవస్థ కూడా ప్రభావితం కావడం వల్ల ఆందోళన కలిగించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి ఛాతి, కడుపుతో సంబంధం కలిగి ఉంటుంది. కర్కాటక రాశి సౌర వ్యవస్థకు హృదయం వంటిది. ఈ రాశి భావోద్వేగ సంకేతం వంటిది. దీంతో ఈ రాశి గల వారు త్వరగా డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. వారు ఒత్తిడికి అనుభూతి చెందినప్పుడు బాగా ఆకలి వేసే అవకాశాలున్నాయి. దీంతో కర్కాటక రాశి వారు జీర్ణ రుగ్మతలకు గురవుతారు. అయితే కర్కాటక రాశి వారు ఎప్పుడూ కంఫర్ట్ జోన్‌లో ఉండటానికి ఇష్టపడతారు. కంఫర్ట్ జోన్‌లోనే సురక్షితంగా జీవిస్తారు. దీని నుంచి బయటిరావడానికి అస్సలు ఇష్టపడరు. ఏమైనా అనుకోని విపత్తులు ఎదురవుతాయా అని చాలా భయపడుతుంటారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించుకోలేక ఇబ్బందులు పడుతుంటారు.
సింహ రాశి గుండె, వెన్ను, వెన్నెముక, రక్తంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశి మూల చక్రం చాలా శక్తివంతంగా ఉంటుంది. సింహరాశి గలవారు తరచుగా బీపీతో బాధపడుతుంటారు. అంతేకాకుండా ఈ రాశి గల వారికి గుండె సమస్యలు దరిచేరతాయి. గుండె దడ సవాళ్లను కలిగించే వారి అగ్ని మూలకాన్ని అదుపులో ఉంచుకోవడం ఈ రాశి గల వారికి చాలా ముఖ్యం. మరోవైపు సింహ రాశి వారికి ఆత్మగౌరవం ఎక్కువ. వారిని ఎవరైనా విస్మరిస్తే అస్సలు తట్టుకోలేరు. వారు గుంపులో ఉండకుండా ప్రత్యేకంగా ఉండటానికే ఇష్టపడతారు. అదే విధంగా, అందరూ తమను ప్రత్యేకంగా చూడాలని భావిస్తారు. కానీ, ఇతరులు తమను సరిగ్గా గుర్తించకపోతే చిన్నతనంగా భావిస్తారు.
బుధుడు పాలించే కన్య రాశి పొత్తికడుపు, ప్రేగులతో సంబంధం కలిగి ఉంటుంది. కన్యారాశి గల వారికి కొన్నిసార్లు జీర్ణవ్యవస్థ, ఆహారపు అలవాట్లతో సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కన్యారాశి వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ దానిపై మక్కువ చూపకూడదు. ఆహారం తీసుకునే విషయంలో సమతుల్యత పాటించడం చాలా కీలకం. మరోవైపు కన్యా రాశి వారు తమ జీవితంలో ఎలాంటి చిన్న చెడు సంఘటన జరిగినా తట్టుకోలేరు. వీరికి ఓసీడీ అలవాటు ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలలో పరిపూర్ణతను సాధించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీరు ఎక్కువ ప్రతికూల భావాలను కలిగి ఉంటారు. ఈ రాశి గల వారు సాధారణంగా నిరాశలో ఉంటారు.
తుల రాశి మూత్రపిండాలు, అడ్రినల్ గ్రంథులు, చర్మంతో సంబంధం కలిగి ఉంటుంది. శుక్రుడు పరిపాలించడం కారణంగా తులా రాశి సౌరవ్యవస్థలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. తులా రాశి గల వారు సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి గల వారు ఎక్కువగా హైడ్రేటెడ్ మరియు తేమగా ఉండటం చాలా ముఖ్యం. తులారాశి వారు మంచి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే వారికి కడుపు సమస్యలతో పాటు తీసుకునే ఆహారం కారణంగా అసమతుల్యత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.
వృశ్చిక రాశి మూత్రాశయం, పురీషనాళం, జననాంగం, అండాశయాలు, వృషణాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ రాశి మూల చక్రం, పవిత్ర చక్రంపైనే ఈ రాశి శక్తి ముడిపడి ఉంటుంది. వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా లేకపోతే లైంగికంగా సంక్రమించే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి గల మహిళలకు మూత్రాశయం ఇన్ఫెక్షన్లు, యూటీఐ మరియు పీసీవోఎస్ వంటి సవాళ్లు ఎదురవుతాయి.
ధనుస్సు రాశి తుంటి , తొడలు, మరియు దృష్టితో సంబంధం కలిగి ఉంటుంది. ధనుస్సు రాశి గల వారికి కళ్ళకు సంబంధించిన సవాళ్లు ఎదురవుతాయి. వీరు సరైన చికిత్సను కలిగి ఉండటం చాలా ముఖ్యం. దృష్టి లోపం కూడా వారిని ప్రమాదాలకు గురి చేస్తుంది. మరోవైపు ధనస్సు రాశి వారికి తీవ్రమైన భయం ఉంటుంది. వీరు సహజ అన్వేషకులు, ప్రయాణించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వారి స్వేచ్ఛ, ప్రయాణం ఎప్పుడూ పరిమితంగానే ఉంటుంది. ఎక్కువ బాధ్యతలను తమ భుజాన వేసుకోవాలంటే భయపడతారు. ఎప్పుడూ బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ భరించలేనన్ని బాధ్యతలు వారిపై ఉంటాయి.
మకర రాశి ఎముకలు, మోకాలు, దంతాలు, చర్మం మరియు కీళ్లతో సంబంధం కలిగి ఉంటుంది. మకర రాశి వారు ఎక్కువగా కీళ్ల నొప్పులకు గురవుతారు. ఈ రాశి గల వారు ఒకవేళ క్రీడాకారులైతే ఎక్కువగా కీళ్ల నొప్పులకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఈ రాశి వారు ఏదైనా కార్యాచరణలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి కాళ్లు, చీలమండలు మరియు రక్త ప్రసరణతో సంబంధం కలిగి ఉంటుంది. కుంభరాశి గల వారికి ఎక్కువగా అనారోగ్య సవాళ్లు ఉండవచ్చు. అందువల్ల వీరి కాళ్లకు అప్పుడప్పుడు మంచి మసాజ్ ఇవ్వాలి. వీరు చీలమండల్లో నొప్పిని కూడా భరించే అవకాశం ఉంటుంది. కుంభ రాశి వారు కాళ్లకు సంబంధించిన మసాజ్‌లు చేయించుకుంటే మంచిది. ఈ మసాజ్‌లు వీరికి అనేక విధాలుగా సహాయపడతాయి.
మీన రాశి నాడీ వ్యవస్థ, పాదాలతో సంబంధం కలిగి ఉంటుంది. మీన రాశి గల వారి రోగనిరోధక వ్యవస్థ ఆందోళన కలిగిస్తుంది. అందువల్ల వీరికి పలు సవాళ్లు ఎదురవుతాయి. అందువల్ల మీనరాశి గల వారు శ్వాస వ్యవస్ధను ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటే మంచిది. ఎందుకంటే అది వారి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. మరోవైపు మీన రాశి వారు సొంత ఊహాత్మక ప్రపంచంలో జీవిస్తుంటారు. వీరు తమ సృజనాత్మకతపై ఎక్కువగా ఆధారపడతారు. వీరు తాము నిర్వర్తించాల్సిన బాధ్యతల పట్ల ఎక్కువగా భయపడతారు. తమ భుజాలపై భారం లేదా బాధ్యతను తట్టుకోలేరు. వీరు వీలైనంత త్వరగా బాధ్యత నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు.