టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌లపై నేడు విచారణ జరగనుంది. దసరా సెలవుల ప్రత్యేక బెంచ్ (వెకేషన్ బెంచ్) ఇవాళ విచారణ జరపనుంది. జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు 8వ కేసుగా ఈ బెయిలు పిటిషన్ విచారణ జాబితాలో ఉన్నట్లు తెలిసింది.
ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 19వ తేదీన హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి వెకేషన్ బెంచ్ ముందుకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను 27వ తేదీ నాటి విచారణకు కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగార అధికారులను ఆదేశించినంది.
మరోవైపు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి. మరోవైపు బాబు అరెస్టు వార్త విని గుండె పగిలి మరణించిన కుటుంబాలను నిజం గెలవాలి అనే యాత్రతో నారా భువనేశ్వరి పరామర్శిస్తున్నారు.