హార్ట్ ఎటాక్ అనేది సాధారణంగా కార్డియో వాస్కులర్ సమస్య. విశ్వ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. పురుషులు మరియు మహిళలు కూడా హార్ట్ ఎటాక్ సమస్యలతో బాధ పడుతున్నారు. అయితే పురుషులతో కంపేర్ చేసి చూస్తే మహిళలు ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. వాళ్లలో సివియర్‌గా ఉంటుంది అని తెలుస్తోంది. అయితే పురుషుల్లో హృదయ సంబంధిత సమస్యలను డిటెక్ట్ చేయొచ్చు.
కానీ మహిళల్లో సమస్యను డిటెక్ట్ చేయడం కాస్త కష్టమే అని రీసెర్చర్లు అంటున్నారు. ముందుగా లక్షణాలను గుర్తించి మెడికల్ హెల్త్ తీసుకోవడంలో కష్టమవుతుందని అంటున్నారు నిపుణులు. అయితే ఈ రోజు మనం హృదయ సంబంధిత సమస్యల గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మహిళల్లో వచ్చే హృదయ సంబంధిత సమస్యల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూసేద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
నిజంగా హృదయ సంబంధిత సమస్యలు చాలా సడన్‌గా వస్తాయి. దీని వల్ల కనుక్కోవడం కూడా కష్టంగా ఉంటుంది. అలానే మెడికల్ సపోర్ట్ కూడా ఉండదు. సాధారణంగా పురుషులు హృదయం కంటే మహిళలు హృదయం చిన్నగా ఉంటుంది. అలానే గుండెల్లో ఉండే వాల్స్ చాలా సన్నగా ఉంటాయి. దీనితో పురుషుల్లో కంపేర్ చేసుకుంటే మహిళల్లో పది శాతం రక్తం తక్కువ పంపిణీ అవుతుంది. అదే విధంగా మహిళలు ఎక్కువ ఒత్తిడికి కూడా గురవుతుంటారు. దీంతో పల్స్ రేటు పెరిగిపోతుంది.
అప్పుడు రక్తంని గుండె ఎక్కువ పంప్ చేస్తుంది. అదే ఒకవేళ పురుషుడు ఒత్తిడికి గురైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అయితే బయోలాజికల్ పరంగా చూసుకున్నట్లయితే మహిళలు హృదయ ఆరోగ్యానికి మరింత శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే హార్ట్ ఎటాక్‌లని ముందుగా గుర్తించడం కష్టం.
అయితే మహిళల్లో వచ్చే అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు చూద్దాం. మహిళలల్లో కార్డియో వాస్కులర్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఎండో మెట్రియాసిస్, ఓవరీ డిసీజ్, డయాబెటిస్, హైబీపీ ప్రెగ్నెన్సీ సమయంలో రావడం లాంటి వాటి వల్ల హార్ట్ ఎటాక్ చాన్సులు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా మహిళలు హై బీపీ, హై బ్లడ్ షుగర్ లెవెల్స్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ స్మోకింగ్ అండ్ ఒబెసిటీ సమస్యలనే పురుషులులాగే ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక పురుషులతో కంపేర్ చేసి చూస్తే మహిళల్లో హార్ట్ఎటాక్ సమస్యలు ఎక్కువ అవుతాయి.
సాధారణంగా మనం సినిమాల్లో చూసినట్లయితే హార్ట్ఎటాక్ రాగానే చెస్ట్ పెయిన్ వస్తుంది ఎందుకంటే బ్లడ్ ఫ్లో గుండెలో తగ్గుతుంది. కానీ మహిళలకి హార్ట్ఎటాక్ సమయంలో చెస్ట్ పెయిన్ రాదు. ఇతర కొన్ని లక్షణాలు వాళ్ళలో కనిపిస్తాయి. దీని కారణంగా ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టం అవుతుంది.
ఎందుకంటే లక్షణాలని గుర్తించలేరు కాబట్టి దీని కారణంగా మరింత ప్రమాదంగా మారుతుంది. కొందరు మహిళల్లో చెస్ట్‌లో నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. హార్ట్ ఎటాక్ రావడానికి కొన్ని వారాల ముందు చెస్ట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దానిని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ లక్షణాన్ని మనం గుర్తించవచ్చు.
మహిళలు బాగా పెద్దవాళ్ళు అయినప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకుంటాయి. 60 ఏళ్ళు వచ్చే సరికి ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతాయి. దీని కారణంగా కార్డియో వాస్క్యులర్ సమస్యలు డెవలప్ అవుతాయి. పైగా ఆ వయసు చేరుకునేటప్పటికి డయాబెటిస్, హైబీపీ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్ చాలా ప్రమాదకరంగా మారుతుంది.
ఇక మనం మహిళల్లో హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు చూడొచ్చు అనేది చూస్తే పురుషుల్లో ఉండే లక్షణాలు మహిళల్లో కనపడవు. అయితే మహిళల్లో ఎలాంటి లక్షణాలను మనం గుర్తించవచ్చు అనేది చూస్తే…హార్ట్ ఎటాక్ సమస్య ఉంటే గుండె బాగా బరువుగా ఉన్నట్లు పిండేసినట్లు అనిపిస్తుంది. అలానే చాలా అన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. అదే విధంగా కొంచెం నొప్పి కూడా ఉంటుంది. చేతులు, మెడ, నడుము భాగాల్లో నొప్పులు వస్తాయి.
మెడ, చేతులు, నడుము ఇలా కొన్ని శరీర భాగాల్లో నొప్పి కలుగుతుంది. ఇవి హార్ట్ ఎటాక్ లక్షణాలు అవ్వచ్చు. అలానే కడుపు నొప్పి కూడా ఉంటుంది. ఏదో ఏనుగు మీద కూర్చున్నంత ఒత్తిడి పడింది అంటే కచ్చితంగా అది హార్ట్ ఎటాక్ లక్షణం అని చెప్పొచ్చు. అలానే గుండెలో మంట, స్టమక్ క్యాన్సర్ లాంటి లక్షణాలు కూడా కనపడే అవకాశం ఉంటుంది.
ఈ మధ్య కాలం లో హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి మహిళలు అయినా పురుషులైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు హృదయానికి మేలు చేసే పద్ధతులు పాటించాలి. సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఒత్తిడి లేకుండా ఉండడం, సమాన బరువు ఉండడం, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండటం ఇలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే కచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హృదయ సంబంధిత సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని మంచిగా జీవన విధానాన్ని పాటించి ఆరోగ్యంగా జీవించండి.