కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం దంచికొట్టింది. కొన్నిచోట్ల ఈదురుగాళ్లతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో కరీంనగర్‌ పట్టణంలోని గీతా భవన్‌ సెంటర్‌లో ఉన్న 70 అడుగుల ఎత్తైన శ్రీ రాముడి పట్టాభిషేక లైటింగ్‌ కటౌట్‌ కూలిపోయింది. ఫిబ్రవరిలో జరగబోయే బ్రహ్మోత్సవాల్లో రాముడి పట్టాభిషేకాన్ని ఆవిష్కరించేలా ఆలయ కమిటీ అధికారులు సుమారు రూ. 45 లక్షలు ఖర్చు చేసి ఈ భారీ హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. వారం రోజుల నుంచి రాత్రి వేళల్లో కటౌట్‌ ఆకట్టుకుంటోంది.

అయితే సర్కిల్‌లోనే కట్టెలు కూలడంతో ప్రమాదం తప్పింది.గాలుల ధాటికి విద్యుత్‌ దీపాల అలంకరణ లుమినార్‌ నేలకొరిగింది. జిల్లాలోని చొప్పదండి, రామడుగు, మానుకొండూరు, పెద్దపల్లి, శంకరపట్నం, జమ్మికుంట మండలలాల్లోనూ భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల​ఆలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ స్థాయిలో గాలులు వీడయంతో సిరిసిల్ల విద్యానగర్‌లో విద్యుత్‌ స్తంబాలు, చెట్లు విరిగిపోయాయి.