కర్ణాటక ఎలక్షన్స్ : కన్నడ ఓటర్లకి కీలక వాతావరణ హెచ్చరిక

Heavy rainfall and Thunderstorm in Karnataka

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఈరోజు కర్ణాటకకు అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల పోలింగ్ సాగుతున్న నేపథ్యంలో ఓటర్లకు వాతావరణశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 30 జిల్లాలుండగా 23 జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీవర్షం కురిసే అవకాశమున్నందున ఓటర్లు ముందుగా ఓటేయాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు. ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు…

మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని సమాచారం. అయితే ఉదయం వేళల్లో కంటే సాయంత్రం సమయంలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారి తెలిపారు. అయితే కర్ణాటకలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓటర్ల సహాయక చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆ పార్టీ కార్యకర్తలను ఆదేశించారు.