రానున్న 3 రోజులు భారీ వర్షాలు…. భాగ్యనగరానికి యెల్లో అలెర్ట్

రానున్న 3 రోజులు భారీ వర్షాలు.... భాగ్యనగరానికి యెల్లో అలెర్ట్
Heavy rains in hyderabad

ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఉదయం ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం ఒకసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అలాగే బంగాళాఖాతంలో రుతుపవనాల ద్రోని ఉత్తర దిశగా విస్తరించింది, దీంతో రుతుపవనాలు మరింత చురుగ్గా మారితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక అల్పపీడనం లేకపోతే ఈ సీజన్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దక్షిణ ఆంధ్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈనెల 3న మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో వర్షాలు పడనున్నాయని అంచనా వేస్తున్నారు.

20 జిల్లాలకు ఎల్లో అలర్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇక ఆగస్టు మొత్తం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉంటే, సెప్టెంబర్ లో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు