ఏపీని మళ్లీ వాన గండం వెంటాడుతోంది. ముఖ్యంగా కోస్తాకు భారీవర్షాల ముప్పు పొంచి ఉంది. ఈ నెల 19న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 24 గంటల్లో ఇది బలపడుతుందనియ వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఇది వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారుతుందా.. లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.
కానీ17న కోస్తా, యానాం ప్రాంతాల్లో ఓ మోస్తరుగా.. ఈ నెల 18 నుంచి కోస్తా, ఒడిశాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. 19, 20న భారీ నుంచి అతి భారీ.. రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ప్రభుత్వం, రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
ఇదిలా ఉంటే ఉభయ గోదావరి జిల్లాలతో పాటూ మరికొన్ని ప్రాంతాల్లో నాలుగైదు రోజుల క్రితం కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అలాగే పంటలు కూడా నీటమునిగాయి.. ఆ వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడిప్పుడే మెల్లిగా తేరుకుంటున్నాయి. మళ్లీ వానలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.