ముంబైని వీడ‌ని వాన‌లు

Heavy rains in Mumbai schools and colleges to be holiday

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ముంబై మ‌హాన‌గ‌రంలో వ‌ర్ష‌బీభ‌త్సం కొన‌సాగుతోంది. ఇవాళ‌ ఒక్క‌రోజే 12 గంట‌ల వ్య‌వ‌ధిలో దాదాపు 9సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోద‌యిందంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. నిన్న రాత్రి నుంచి కుంభ‌వృష్టిగా కురుస్తున్న వ‌ర్షాలు ఇప్పుడ‌ప్పుడే త‌గ్గే ప‌రిస్థితి క‌నిపించటం లేదు. మ‌రో 72 గంట‌ల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. దీంతో అన్ని విద్యాసంస్థ‌ల‌కు రేపు కూడా సెల‌వు ప్ర‌క‌టించారు. భారీ వ‌ర్షాలు విమానాలు, రైళ్ల రాక‌పోక‌ల‌పైనా ప్ర‌భావం చూపాయి. ఛ‌త్ర‌ప‌తి శివాజీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ప్ర‌ధాన ర‌న్ వేను మూసివేశారు. 50 విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేశారు. ప‌లు రైలు స‌ర్వీసుల‌ను కూడా ర‌ద్దు చేశారు. ముంబై ర‌హ‌దారులు చెరువుల‌ను త‌ల‌పిస్తున్నాయి. భారీ వ‌ర్షాల ధాటికి ఆర్థిక రాజ‌ధానిలో జ‌న‌జీవ‌నం స్తంభించింది. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్పితే బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నారు.