జై లవ కుశ మూవీ లైవ్ అప్ డేట్స్…

Jai lava Kusa Movie live updates

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   ఎన్టీఆర్ , నివేద థామస్ , రాశి ఖన్నా , దునియా విజయ్ , అభిమన్యు సింగ్ 
నిర్మాత :     కళ్యాణ్ రామ్ 
దర్శకత్వం :    బాబీ 
మ్యూజిక్ డైరెక్టర్ :  దేవీ శ్రీ ప్రసాద్ 
ఎడిటర్ :      కోటగిరి వెంకటేశ్వర రావు 
సినిమాటోగ్రఫీ : చోటా కె. నాయుడు 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటు సినీ రంగం అంతా ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసిన జైలవకుశ రానే వచ్చింది. ఈ సినిమా ప్రీమియర్ షో అమెరికాలో బుధవారం సాయంత్రం 6 గంటలకి అంటే భారత కాలమానం ప్రకారం గురువారం వేకువజామున 3 .30 కి వేశారు. అక్కడ నుంచి తెలుగు బులెట్ ప్రతినిధి ప్రతి పదినిమిషాల వ్యవధిలో అందిస్తున్న లైవ్ అప్ డేట్స్ .

* 3 . 40 కి అమెరికాలో షో బిగిన్ అయ్యింది .

* 3 .50 కి జైలవకుశుల బాల్యం గురించి చెబుతూ సినిమా మొదలు అయ్యింది. చిన్నప్పుడు పౌరాణిక నాటకాలు వేసుకునే ఆ కుటుంబలో జై పాత్రధారి నత్తిని ఎత్తి చూపడంతో. అతను బాధ పడతాడు.

* 4 .00 కి 20 ఏళ్ల తర్వాత కుశ పాత్రధారి గా ఎన్టీఆర్ దోచేస్తా పాటతో ఎంటర్ అవుతాడు.కృష్ణాష్టమి పండగ సందర్భంగా వచ్చే ఈ పాటలో ఎన్టీఆర్ స్టెప్స్ బాగున్నాయి .

* 4 .10 కి పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వచ్చే కామెడీ సీన్ అదిరిపోయింది. ఇక కుశ, లవ పాత్రలు ఎదురుపడే సన్నివేశాలు సూపర్ .

*4 .20 కి మంచితనానికి మారు పేరుగా వుండే లవకి వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అనుకోని కష్టాలు వస్తాయి. అవి భరించలేని అతను సోదరుడు కుశుడికి చెప్తాడు.

* 4 .30 కి సోదరుడి కష్టాలు తీర్చడానికి లవ ప్లేస్ లోకి కుశ రావడంతో కోన వెంకట్ తరహా కన్ఫ్యూజన్ కామెడీ మొదలు అవుతుంది.

* 4 .40 కి ఒకరిని ఇంకొకరు అనుకునే కామెడీ సీన్స్ పండాయి. కుశతో కామెడీ మిక్స్ చేసిన ఫైట్ బాగుంది.అక్కడ లవ , ప్రియదర్శి ( పెళ్లి చూపులు ఫేమ్ ) మధ్య సన్నివేశాలు కూడా బాగున్నాయి .

* 4 .50 కి ట్రింగ్ ట్రింగ్ పాట అయిపోవడంతో పాటు జై పాత్రధారి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయింది.

* 5 .00 జై సీన్స్ కి వస్తున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అసుర, అసుర అదిరిపోయింది.జై పాత్ర చుట్టూ ఊహించని మలుపుతో ఇంటర్వెల్ బాంగ్ పడింది.

ఫస్ట్ హాఫ్…జైలవకుశ ఫస్ట్ హాఫ్ బాగుంది. తొలి 15 నిమిషాలు పాత్రలు, నేపధ్యం చెప్పడానికి వాడుకున్నారు. ఆ తర్వాత వినోదం పండింది. మూడు పాత్రల్లోనూ ఎన్టీఆర్ బాగా వేరియేషన్ చూపాడు. జై పాత్రలో ఎన్టీఆర్ నటన గురించి ఫాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ కూడా కొన్నేళ్లపాటు మాట్లాడుతుంది. 5 .15 కి సెకండ్
హాఫ్ స్టార్ట్ .

* భైరాన్పూర్ లో జై పాత్రధారి రావణ ఎపిసోడ్ తో సెకండ్ హాఫ్ మొదలు. అతను చెప్పే రాజకీయ సంబంధమైన డైలాగ్స్ అలరిస్తాయి. ” గెలిచిన వాడికి వుండే గుర్తింపు గెలిపించిన వాడికి ఉండదు ” అని ఎన్టీఆర్
చెప్పే పొలిటికల్ డైలాగ్స్ సూపర్ .

* 5 .25 కి రాజకీయంగా తన అవసరాల్ని తీర్చుకునేందుకు లవకుశల్ని జై కిడ్నాప్ చేయించి తన ఇంటికి తీసుకొస్తాడు.

* 5 . 35 కి ముగ్గురు ఎన్టీఆర్ లు ఒక్క చోటకే రావడంతో జై ఇంటిలో కన్ఫ్యూజన్ మొదలు అవుతుంది.

* జై , కుశ, నివేద తో తీసిన నీ కళ్ళలోన సాంగ్ బాగుంది. ( 5 .40 )

* 5 .45 కి జై ఇంటిలో సన్నివేశాలు వినోదం పండిస్తున్నాయి. జై మొత్తం స్క్రీన్ ని డామినేట్ చేస్తున్నాడు. అతను తమన్నా చేసిన స్వింగ్ జరా పాటలో స్టెప్స్ అదిరిపోయాయి.

* 5 . 55 కి పౌరాణిక పాత్రల ప్రదర్శనతో అన్నదమ్ముల మధ్య దూరం తగ్గుతుంది అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ డైలాగ్స్, యాక్షన్ ప్రేక్షకుడిని అలా వెంటాడుతాయి. అతనితో సెహబాష్ అనిపిస్తాయి. ఇది ప్రీ క్లయిమాక్స్ సీన్.

* 6 .05 కి క్లైమాక్స్ సీన్ లో యాక్షన్ కన్నా సెంటిమెంట్ కి పెద్ద పీట వేసాడు దర్శకుడు బాబీ.