తూర్పు మధ్య బంగాళాఖాతం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రేపటిలోగా మరింత అల్పపీడనం బలపడనుందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో మరింత చురుగ్గా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయి.
రెంటింటి ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. గురు,శుక్రవారాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.