ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర జవాన్ మూవీ కలెక్షన్ల సునామీ ని సృష్టించింది. నిజానికి పఠాన్ మూవీ తోనే ‘షారుఖ్ ఖాన్’ బాక్సాఫీస్ కింగ్ ఖాన్ అనిపించుకున్నాడు. ఇక అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ తో మరొకసారి తనకు తిరుగు లేదని నిరూపించుకున్నాడు. మొత్తానికి షారుఖ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, తాజాగా షారుఖ్ ని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయట. ఈ నేపథ్యంలో షారుఖ్ కి భద్రతను పెంచేశారు .
ఇంతకీ, అసలేం జరిగింది అంటే.. షారుఖ్ ఖాన్‌కి మహారాష్ట్ర ప్రభుత్వం భద్రతను అప్‌గ్రేడ్ చేసింది. షారుఖ్ ‘జవాన్’ విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తులు షారుఖ్‌ని చంపేస్తామంటూ ముంబైలోని ఆయన నివాసానికి లేఖలు పంపించారంట . స్పందించిన ప్రభుత్వం ఇప్పటికే ఉన్న భద్రతను పెంచారు. దీంతో షారుఖ్ ఖాన్ కు 6 మంది 3 షిఫ్టుల్లో సిబ్బంది 24*7 భద్రత ని కల్పించనున్నారు.