Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉన్నట్టుండి మన ఇంటి మీద ఆకాశంలో వెళుతున్న హెలికాఫ్టర్ డోర్ ఊడిపడితే ఎలా ఉంటుంది?. ఈ ప్రశ్న అడగ్గానే అయినా అలా జరగడానికి ఇది ఏమన్నా సినిమానా అని ఎదురు ప్రశ్నిస్తారు. సినిమాల్లో ఇలాంటి సీన్ వున్నా మరీ అతి అనుకుంటాం. కానీ నిజంగానే ఇలాంటి సంఘటన ఈరోజు హైదరాబాద్ లో జరిగింది.
తార్నాక లోని లాలాపేట్ యాదవ్ బస్తీలోని ఓ ఇంటిపై పెద్దశబ్దంతో హెలికాఫ్టర్ డోర్ పడింది. ఆకాశంలో వెళుతున్న ఓ హెలికాఫ్టర్ నుంచి ఇది ఊడిపడినట్టు స్థానికులు గుర్తించారు. ఏవియేషన్ లేదా సైనిక విభాగం ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు ఇలా జరిగివుంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కిందపడ్డ డోర్ ని స్వాధీనం చేసుకున్నారు.