హలో! సెన్సార్ టాక్… మైండ్ బ్లోయింగ్

Hello Movie Censor Report

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘కింగ్’ నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రం హలో!… డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు ‘కళ్యాణి ప్రియదర్శన్’ ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ మరియు పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. హలో! చిత్రం అన్ని ఏర్పట్లు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. నాగార్జున ఈ చిత్రాన్ని డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురబోతున్నాడు. హలో! సినిమాని డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ ప్రతి ఫ్రేమ్ ని ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. హలో! చిత్రంలో అఖిల్ కళ్యాణి ప్రియదర్శన్ మధ్య వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ అధ్బుతంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ విక్రమ్ కె కుమార్. హలో! లో అఖిల్ యాక్షన్ ఎపిసోడ్లు ఈ సినిమాకు హైలైట్స్ గా నిలవటం ఖాయం అని అంటున్నారు.

హలో! సినిమా సెన్సార్ కార్యక్రమాలను ఈరోజు పూర్తి చేసుకుంది. ఈ హలో సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ ”యు” సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు, హలో! చిత్రం అద్బుతంగా ఉందని, డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తన స్ర్కీన్ ప్లేతో నడిపిన విధానం చాలా బాగుందని, ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ లో అఖిల్ పెర్ఫార్మెన్స్ అదరగొట్టాడని, మొదటి సినిమాకంటే ఈ సినిమాలో అఖిల్ యాక్టింగ్ అండ్ ఫైట్లు బాగా చేసాడని సెన్సార్ బోర్డు సభ్యులు చెపుతున్నారు. అలాగే అఖిల్ అండ్ కళ్యాణ్ ప్రియదర్శన్ మధ్యనే వచ్చే సీన్లన్నీ మంచి కెమిస్ట్రీ తో నడితాయని , ఈ రొమాన్స్ హద్దులు దాటేయలేదని. అందుకే ఈ సినిమాకు కట్లు లేకుండా ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చామని సెన్సార్ బోర్డు సభ్యులు చెపుతున్నారు. ఈ విషయం తెలిసిన నాగార్జున మరియు చిత్ర యూనిట్ సభ్యులు ఎంతో ధీమాగా ఉన్నారు… అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఆనందంతో చిందులేస్తున్నారు.