అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. రెండు దశాబ్దాలుగా ఈయనకు మూడు నాలుగు కమర్షియల్ సక్సెస్‌లు దక్కలేదు. అయినా కూడా తనవంతు ప్రయత్నం అన్నట్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. గతంతో పోల్చితే ఇప్పుడు సినిమాల సంఖ్య బాగా తగ్గించిన సుమంత్ తాజాగా తన కొత్త సినిమాను ప్రారంభించినట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఈసారి థ్రిల్లర్ ఎంటర్టైనర్తో రాబోతున్నట్లుగా ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చాడు. రెగ్యులర్ సినిమాలతో సక్సెస్‌లు రావడం లేదని భావించిన సుమంత్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
వరుసగా చిత్రాలు చేసి సక్సెస్‌లు దక్కించుకోవాలి, తద్వారా స్టార్డం తెచ్చుకోవాలనే ఆశ సుమంత్‌కు లేదు. అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చాను కనుక సినిమాల్లో కొనసాగాలనే అతడు సినిమాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సక్సెస్ కోసం సుమంత్ కష్టమేమీ పడకుండా తనకు నచ్చిన చిత్రాలు, మనసుకు తోచిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అది కూడా తక్కువ బడ్జెట్లోనే తీయాలని నిర్మాతలకు మరియు దర్శకులకు చెబుతూ మరీ సుమంత్ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. తాజాగా సుమంత్ చేయబోతున్న సినిమాకు అనీల్ శ్రీకంఠం అనే దర్శకుడు పరిచయం కాబోతున్నాడు. శ్రీధర్ ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో రిస్క్ లేకుండా నిర్మించేందుకు ఏర్పాట్లు చేశాడు. వచ్చే సంవత్సరం వేసవి లేదా తర్వాత విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. సుమంత్ సక్సెస్ కోరుకోవడం లేదు కాని, అక్కినేని ఫ్యాన్స్ మాత్రం సుమంత్‌కు ఒక్క సక్సెస్ వచ్చినా సంతోషం అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.