Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇండియన్ సినిమా పరిధి ఇప్పుడిప్పుడే విస్తృతం అవుతోంది. బాహుబలి తో అంతర్జాతీయ మార్కెట్ లో ఇండియన్ సినిమా విలువ పెరిగింది. ఆ మార్కెట్ చూసాక ఇప్పుడు సబ్జెక్టు పరంగా కూడా సరికొత్త ప్రయోగాలు చేయడానికి దర్సకనిర్మాతల్లో ధైర్యం పెరిగింది. ఇన్నాళ్లు హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే అంతరిక్షం సబ్జెక్టు మీద సినిమాలు చేయడం చూసాం. ఇప్పుడు ఓ తమిళ సినిమా అలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేస్తోందన్న వార్త చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇలా బయటికి ప్రచారం చేసి ఏదో ఒకటి చుట్టిపడేస్తారులే అనుకున్నారు చాలా మంది. అయితే వారి అంచనాలను తల్లకిందులు చేసింది ఆ తమిళ్ సినిమా.
“ టిక్ టిక్ టిక్ “ పేరుతో తమిళ సినీ రంగం నుంచి పూర్తిగా అంతరిక్ష నేపథ్యంలో ఓ సినిమా చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు దక్షిణాదిన మాత్రమే కాదు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయ్యింది. ఓ ప్రాంతీయ భాష చిత్రంలో అంతరిక్షాన్ని నేపధ్యంగా ఎంచుకోవడమే కష్టం అయితే ఆ సినిమాని చిత్రీకరించిన తీరు చూసాక ఆ దర్శక నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. జయం రవి హీరోగా చేస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని పబ్లిక్ తో పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మీరు కూడా ఆ ట్రైలర్ మీద ఓ లుక్ వేయండి.