Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే విషయం అనధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటి వరకు ఆయన నోరు తెరిచి అధికారికంగా చెప్పకున్నా కూడా ఆయన సన్నిహితులు చెబుతున్నదాన్ని బట్టి, ఆయన చేస్తున్నదాన్ని బట్టి అర్థం అవుతుంది. వచ్చే స్వాత్రిక ఎన్నికల సమయానికి రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అయ్యింది. ఎన్నో సంవత్సరాలుగా రజినీకాంత్ రాజకీయాల గురించి చర్చ జరుగుతుంటే ఇప్పటికి ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. అయితే కమల్ మాత్రం హఠాత్తుగా రాజకీయాల్లోకి తెరంగేట్రం చేస్తున్నాడు.
గత ఆరు నెలలుగా రజినీకాంత్ రాజకీయాల గురించి తారా స్థాయిలో ప్రచారం జరుగుతుంది. కాని ఇప్పటి వరకు రజినీకాంత్ పార్టీని ప్రకటించలేదు. కాని కమల్ మాత్రం నెల రోజులుగా రాజకీయాలు మాట్లాడుతున్నాడు, మరో వారం పదిరోజుల్లో పార్టీ పెట్టేందుకు సిద్దం అవుతున్నాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కమల్ హాసన్ గాంధీ జయంతి సందర్బంగా పార్టీని ప్రకటిస్తాడని తెలుస్తోంది. రజినీ పార్టీని ప్రకటించేందుకు ఇంకా ఎన్ని నెలలు పడుతుందో చూడా తెలియదు. మొత్తానికి కమల్ హాసన్ చాలా స్పీడ్‌గా ఉన్నాడు. ఇదే జోరు ఎన్నికల్లో కనిపిస్తుందా, రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఉంటుందా అనేది చూడాలి.