Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు తొలి తరం హీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం భారీ స్థాయిలో అంచనాలను కలిగి ఉంది. ఈ చిత్రంలో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించగా, జెమిని గణేష్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషించాడు. ఇంకా ఈ చిత్రంలో సమంత, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, మోహన్‌బాబు, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. అశ్వినీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో నటించినందుకు గాను మోహన్‌బాబు ఏకంగా 75 లక్షల పారితోషికం తీసుకున్నాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
‘మహానటి’ చిత్రంలో మోహన్‌బాబు ఎస్వీ రంగారావు పాత్రను పోషించాడు. మాయాబజార్ చిత్రీకరణ సమయంలో సావిత్రి మరియు ఎస్వీఆర్‌ల కాంబోలో ఆసక్తికర సీన్స్ ఉంటాయి. అందుకే మహానటి చిత్రంలో మోహన్‌బాబును ఆ పాత్రకు ఎంపిక చేయడం జరిగింది. కేవలం మూడు రోజుల చిత్రీకరణలో పాల్గొన్నందుకు మోహన్‌బాబు ఏకంగా 75 లక్షల పారితోషికంను అందుకున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మహానటి చిత్రంపై సినీ వర్గాల వారు గౌరవంతో ఏమాత్రం పారితోషికం తీసుకోకుండా నటించేందుకు ముందుకు వచ్చారు.
ఈ చిత్రంలో గెస్ట్ రోల్స్‌లో కనిపించిన పలువురు నటీనటులు ఒక్క పైసా పారితోషికం తీసుకోకుండానే నటించారు. సావిత్రిపై ఉన్న గౌరవంతో ఆమెకు నివాళ్లను ఇలా అర్పించారు. కాని మోహన్‌బాబు మాత్రం సినిమా ఏదైతే తనకేంటి అంటూ పారితోషికం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో మోహన్‌బాబు తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మహానటికి మోహన్‌బాబు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.