టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యారు. నిఖిల్ సతీమణి పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చారు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చెప్తూ నిఖిల్ పోస్ట్ చేశారు. నిఖిల్ తన కొడుకుని ఎత్తుకొని ముద్దాడుతున్న ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
నిఖిల్ తండ్రి అవ్వడంతో సెలబ్రిటీలు అలానే అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2020లో డాక్టర్ పల్లవిని నిఖిల్ పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే 2020 కరోనా టైంలో వీళ్ళ పెళ్లి అయింది కరోనా నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది సమక్షంలోనే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.