కరోనా ఎఫెక్ట్.. హీరో నితిన్ పెళ్లి వాయిదా

ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది కరోనా వైరస్. దీని దెబ్బకు ప్రపంచం మొత్తం షేక్ అయిపోతుంది. ఇప్పటికే కరోనా లక్షల మందికి సోకగా వేల మంది మృత్యువాత పడ్డారు. తాకిడిని తట్టుకోలేక దేశాలకు దేశాలే లాక్ డౌన్‌లోకి వెళ్లాయి. కార్యక్రమాలు అన్నీ రద్దు.. చేసుకుంటున్నాయి. ఇండియా ఏకంగా 21 రోజులు పాటు లాక్ డౌన్ చేసింది. కరోనా దెబ్బకు అత్యంత ఘనంగా నిర్వహించాలనుకున్న వివాహా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. అందులో యంగ్ హీరో నితిన్ పెళ్లి కూడా ఉంది.లవ్ మ్యారేజ్.

నితిన్-షాలినీలు గత కొన్నేళ్లుగా రహస్యంగా ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే పెద్దల అంగీకారంతో ఏప్రిల్‌లో వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఎంగేజ్మెంట్ ఎంతో అట్టహాసంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌లో భాగంగా పెళ్లిని దుబాయ్‌లో ఏర్పాటు చేశారు. అయితే కరోనా విజృంభించడంతో ఆ పెళ్లి వాయిదా పడింది. ఈ మేరకు నితిన్ ఓ ప్రకటన చేశాడు.

నితిన్ ఏమన్నారంటే.. ‘నా అభిమానులకు, తెలుగు ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడి ఉన్నాయో మీకు తెలుసు. అత్యవసర పరిస్థితుల్లో తప్పా ఎవరూ బయటకు రావకూడదని లాక్ డౌన్ కాలంలో మార్చి 30న నా పుట్టిన రోజును జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. అందువల్ల ఎక్కడా కూడా నా పుట్టిన రోజు వేడుకలను జరుపవద్దని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.
అంతేకాదు లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 16న జరగాల్సిన నా పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటున్నాను.

ఇప్పుడు మనందరం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభ సమయంలో మన ఇళ్లల్లొ మనం కాలు మీద కాలేసుకుని కూర్చొని, మన కుటుంబంతో గడుపుతూ బయటకు రాకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్టు. ఎల్లవేళలా మీ అభిమానంతో పాటు మీ ఆరోగ్యాన్ని ఆశించే మీ నితిన్’ అంటూ పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోరనా కారణంగా ఆగిన హీరో నితిన్ పెళ్లి అంటూ..