ఏపీలో నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలు

కరోనా వ్యాప్తి నివారించేందుకు ఏపీ సీఎం వైస్ జగన్ మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో వ్యాధి ఎక్కువగా ప్రబలుతున్నందున ప్రజలు బయట తిరిగే సమయాన్ని తగ్గించారు. ఇకపై పట్టణ ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటలలోపే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతించాలని సీఎం ఆదేశించారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది.

ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కరోపై సీఎం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో పలువురు మంత్రులూ ఉన్నతాధికారులూ పాల్గొన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తికి అడ్డంకి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే జైలుకు పంపుతామని సీఎం హెచ్చరించారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ప్రదర్శించాలని అందులోనే ఫిర్యాదు చేయాల్సిన కాల్ సెంటర్ నంబర్ కూడా పొందుపరచాలని ఆదేశించారు.రేషన్ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఏ సమస్య ఉన్నా వన్ జీరో ఎయిట్ నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు. నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా నిత్యావసర వస్తువులు ఏదీ కూడా కొరత రాకుండా చూసేకునే బాధ్యత మా ప్రభుత్వంపై ఉందని.. కాబట్టి ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కడైనా సరే అదనంగా పెంచి అమ్మితే కఠినంగా చర్యలు తీసుకుంటాము అవసరమైతే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు పెడతామని స్పష్టం చేశారు. ఇలాంటి విపత్తు సమయంలో ప్రజలంతా సహకరించాలని.. కష్టకాలాన్ని అవకాశంగా మల్చుకొనేందుకు వ్యాపారులు దార్లు వెతుక్కోకూడదని సీఎం నిర్ణయం తీసుకున్నారు.