తన మొట్టమొదటి సినిమాతోనే హీరో రాజ్ తరుణ్ అద్భుతమైన హిట్ అందుకొని డిస్ట్రిబ్యూటర్లను లాభాల బాట పట్టించాడు.అలా తర్వాత తీసిన కొన్ని చిత్రాలు మంచి యూత్ ఫుల్ గా ఆకట్టునేవి ఎంచుకొని తన సినిమాలకు అంటూ ఓ మార్కెట్ ఏర్పరచుకున్నాడు.కానీ ఆ మధ్య వరుస ప్లాప్స్ తో పూర్తిగా తన గ్రాఫ్ ను దెబ్బ తీసుకున్నాడు.దానితో కాస్త గ్యాప్ ఇచ్చినా సరే మంచి చిత్రంతో వద్దాం అనుకున్నాడో ఏమో కానీ దిల్ రాజు బ్యానర్ లోని “ఇద్దరి లోకం” ఒకటే అనే చిత్రంతో నిన్న డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చెయ్యగా ఈ చిత్రానికి మొదటి రోజు వచ్చిన వసూళ్లు తెలిస్తే షాక్ అవుతారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అందులోను సెలవు దినాన కేవలం 16 లక్షలు మాత్రమే వచ్చాయి అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.అలాగే ఇదే రోజు విడుదల కాబడిన “మత్తు వదలరా” చిత్రానికి 30 లక్షలు వచ్చాయి.మంచి టాక్ వచ్చినా సరే ఈ చిత్రానికి తక్కువే వచ్చాయి.కానీ విడుదల అయ్యి రెండు వారాలు పూర్తి చేసుకున్న “వెంకీ మామ” చిత్రానికి మాత్రం కోటి రూపాయల షేర్ వాచినట్టు తెలుస్తుంది.ఓవరాల్ గా రాజ్ తరుణ్ పనయ్యిపోయినట్టే అని చెప్పాలి.పండుగ రోజున కూడా కేవలం 16 లక్షలే అంటే చాలా దారుణం అని చెప్పాలి.