Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్తుతం హీరోలు, రాజకీయ నాయకులు, చిన్న చిన్న నటీనటులు కూడా సోషల్ మీడియాను విరివిగా వాడేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ పరిధిని పెంచుకుంటూ తమ క్రేజ్‌ను వ్యాప్తి చెందేలా చేసుకుంటున్నారు. హీరోలు తమ సినిమాల విశేషాలను, తమ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఇక రాజకీయ నాయకులు తమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా కార్యకర్తలతో పంచుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ఈ మద్య కాలంలో చాలా పవర్ ఫుల్ అయ్యింది. అందుకే దాదాపు అంతా కూడా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి, తమ పరిధిని పెంచుకుంటున్నారు.
ట్విట్టర్ ఆరంభం అయిన కొత్తలోనే రామ్ చరణ్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ట్విట్టర్లో చరణ్ తన సినిమాల గురించి పోస్ట్‌లు పెడుతూ ఉండేవాడు. ఏమైందో ఏమో కాని అనూహ్యంగా ట్విట్టర్ నుండి ఆయన తప్పుకున్నాడు. ప్రస్తుతం ఫేస్బుక్లో అప్పుడప్పుడు కనిపిస్తున్న రామ్ చరణ్ త్వరలో మళ్లీ ట్విట్టర్లో అడుగు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు. రామ్ చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. చరణ్‌కు సంబంధించిన విషయాలు మరియు తమ వ్యక్తిగత విషయాలను ఆమె షేర్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలోనే చరణ్‌తో కూడా ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌ను ఓపెన్ చేయించాలని ఉపాసన చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇన్నాళ్లకు చరణ్ ఒప్పుకున్నాడు. మంచి సమయం చూసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇస్తానంటూ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. చరణ్ ట్విట్టర్, ఇన్‌స్టాలో జాయిన్ అయితే మెగా ఫ్యాన్స్ ఖుషీ అవ్వడం ఖాయం.