అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్17న ఈ చిత్రం విడుదల కానుండటంతో మూవీ టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉండగా.. రష్మిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘సామీ సామీ సాంగ్ కోసం ఎంతో కష్టపడ్డా. అది చూశాక అందరూ నన్ను ప్రశంసిస్తే చాలు. డైరెక్టర్స్ ఏం చెబితే అదే నేను చేస్తా’ అంటూ మాట్లాడిన వీడియోను రష్మిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. అసలు దీన్ని హీరోయిన్‌గా తీసుకోకుండా ఉండాల్సింది. ఇది..దీని ఓవర్ యాక్టింగ్ అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసిన రష్మిక.. ”యాక్టింగో, ఓవరాక్టింగో.. నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాను. నువ్వు ఏం సాధించావు నాన్నా” అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.