డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు శాండల్వుడ్ను కుదిపేస్తున్నాయి. పోలీసుల విచారణలో కన్నడ నటీనటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తుండటంతో సినీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ కేసులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల (సీసీబీ) హీరోయిన్ రాగిణి ద్వివేది ఇంటిపై శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి ఆమెను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో మరో నటి సంజన ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు ఈరోజు ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం. కాగా నటి సంజన సన్నిహితుడు, రియల్ఎస్టేట్ వ్యాపారి రాహుల్ ఇప్పటికే అరెస్టైన విషయం తెలిసిందే.
అతడి ఫోన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ డేటాను సేకరించే పనిలో ఉన్నారు. మొబైల్లోని పలు ఫోటోలు, వీడియోల ఆధారంగా పలువురికి నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో సంజన పేరు బయటకు రావడంతో రాగిణితో తనకు సంబంధం లేదని, ఇద్దరూ ఒక సినిమాలో మాత్రం కలిసి నటిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇక పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన సంజన.. ‘బుజ్జిగాడు’ సినిమాతో టాలీవుడ్లోనూ మంచి గుర్తింపు పొందారు.