మిల్కీ బ్యూటీ తమన్నా ‘బాహుబలి’ చిత్రం తర్వాత స్టార్ హీరోయిన్‌గా మారిపోవడం ఖాయం అని, తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో కూడా తమన్నాకు వరుసగా ఆఫర్లు వస్తాయని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా తమన్నాకు ‘బాహుబలి’ చిత్రం తర్వాత అవకాశాలు చాలా తగ్గాయి. బాహుబలి తర్వాత చేసిన మూడు నాలుగు సినిమాు ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడు కెరీర్ కష్టాల్లో పడ్డట్లయ్యింది. గత సంవత్సరం ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో తమన్నా మెల్ల మెల్లగా కనుమరుగవ్వడం ఖాయం అని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా తమన్నాకు మళ్లీ వరుసగా ఛాన్స్‌లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు అయిదు సినిమాలు ఉన్నాయి.
తెలుగులో తెరకెక్కుతున్న ‘క్వీన్’ రీమేక్ చిత్రంతో పాటు ‘సైరా’ చిత్రంలో కీలక పాత్రలో తమన్నా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు చిత్రాలు కూడా తమన్నాకు మళ్లీ తెలుగులో ఊపిరి ఊదడం ఖాయం అంటున్నారు. మరో వైపు తమిళంలో ఈమె ప్రస్తుతం కన్నై కలైమాని అనే చిత్రంలో నటిస్తుంది. తాజాగా విశాల్‌కు జోడీగా ఈ అమ్మడికి ఛాన్స్ దక్కింది. సుందర్ సి దర్శకత్వంలో రూపొందబోతున్న భారీ చిత్రంలో విశాల్‌తో ఈ అమ్మడు కలిసి నటించబోతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. వచ్చే ఏడాది మరింతగా తమన్నా బిజీ అయ్యే అవకాశం ఉందని కోలీవుడ్‌వర్గాల వారు చెబుతున్నారు. హిందీ నుండి కూడా ఈమెకు ఒకటి రెండు ఛాన్స్‌లు వస్తాయనే టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాలతో తమన్నా మరో మూడు సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్‌గా కొనసాగే అవకాశం ఉంటుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.