Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగులో ‘బొమ్మరిల్లు’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిన ముద్దుగుమ్మ జెనీలియా. ఈ అమ్మడు ఆ తర్వాత పలు తెలుగు మరియు తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలకు సరి జోడీగా నటించి ఆకట్టుకుంది. తెలుగులో ఈ అమ్మడు ‘నా ఇష్టం’ చిత్రంలో నటించి కనిపించకుండా పోయింది. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసిన ఈమె బాలీవుడ్ హీరో రితేష్‌ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లల తర్వాత ఇటీవలే మళ్లీ హిందీలో రెండు సినిమాలు చేసిన ఈమె సౌత్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతుంది.
తాజాగా ఒక హిందీ షోలో పాల్గొన్న జెనీలియా మాట్లాడుతూ.. తెలుగులో తనను ఇంకా అభిమానించే వారు చాలా మంది ఉన్నారని, వారి కోసం తెలుగులో నటించాలనే ఆసక్తి ఉందని, తెలుగుతో పాటు తమిళం మరియు మరాఠిలో కూడా నటించాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. తెలుగులో నటించేందుకు ఆసక్తిగా ఉన్న జెనీలియాకు ఆఫర్‌లు దక్కుతాయా అనేది చూడాలి. హీరోయిన్ ఓరియంటెండ్ చిత్రాలను చేస్తానంటున్న జెనీలియాకు ఆ అవకాశం దక్కేనా చూడాలి. ప్రస్తుతం జెనీలియాతో నటించేందుకు ఏ హీరో కూడా ఆసక్తిగా లేడు. మరి ఇలాంటి సమయంలో ఆసక్తిని కనబర్చుతున్న జెనీలియాకు అవకాశాలు వచ్చేనా అనేది చూడాలి.