కన్నడ నటి పూజా గాంధీ ఎట్టకేలకు పెళ్లి చేసుకోనుంది. తన చిరకాల స్నేహితుడైన వ్యాపారవేత్త విజయ్‌తో ఆమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనుంది.
వృత్తిరీత్యా వ్యాపారవేత్త. లాజిస్టిక్స్ కంపెనీకి చెందిన విజయ్ కర్ణాటకకు చెందినవాడే. అతడిని పెళ్లి చేసుకోవడం ద్వారా పూజా గాంధీ కూడా కర్ణాటకకు కోడలు కాబోతోంది. ప్రస్తుతం పూజా గాంధీ వయసు 40 ఏళ్ళు. కాగా, నటి పూజా గాంధీ 2001 నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది. వాస్తవానికి, పూజా గాంధీ.. బెంగాళీ అమ్మాయి. మాన్ సూన్ రైన్ సినిమా ద్వారా కన్నడలో అడుగుపెట్టింది. కన్నడ చిత్రాలు లు చేస్తూ కన్నడ ప్రేక్షకుల్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఆమె బెంగుళూరుకి వచ్చి కన్నడసినిమా ల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు విజయ్ తో పరిచయం ఏర్పడిందంట . విజయ్ స్వయంగా పూజా గాంధీకి కన్నడ నేర్పించాదంట . దీనితో పూజా సులభంగా కన్నడ సినిమా ల్లో అవకాశాలు అందుకుంది. విజయ్ సహకారంతోనే ఆమె నటిగా రాణించినట్లు తెలుస్తోంది.
ఈ నెల 29న విజయ్, పూజా వివాహం జరగనుంది. మంత్ర మాంగల్యం ద్వారా పూజ పెళ్లి చేసుకోనుంది. బెంగళూరులోని యలహంకలో వీరి పెళ్లి జరగనుంది. వివాహం గురించిన విషయాలు పూజా గాంధీ కానీ, పూజాగాంధీ సన్నిహితులు కానీ ఏమీ చెప్పలేదు. అయితే ఆమె పెళ్లికి సంబంధించిన ఈ విషయం వైరల్‌గా మారింది. దీంతో ఇప్పుడు పూజాగాంధీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పొచ్చు.
కాగా, నటి పూజా గాంధీ 2001 నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది.దక్షిణాది నుంచి వచ్చిన బోల్డ్ క్రైమ్ సినిమా లలో దండుపాళ్యంకి మంచి క్రేజ్ ఉంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుంచి మూడు భాగాలు వచ్చేశాయి . దండుపాళ్యం సిరీస్ తో నటి పూజా గాంధీ బోల్డ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. అంతకు ముందు కూడా ఆమె పలు సినిమా ల్లో నటించింది. ఆమె ఖాతాలో హిట్ కూడా ఉన్నప్పటికీ ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం దండుపాళ్యం సినిమానే అని చెప్పవచ్చు.