మా భర్తల కంటే మేమేం తక్కువ కాదు…

మా భర్తల కంటే మేమేం తక్కువ కాదు...
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు ఎంత సంపాదిస్తున్నారనే విషయం గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోల రెమ్యునరేషన్ బాలీవుడ్ హీరోలను కూడా మించి పోతున్నాయి. ఇక ఇప్పుడు స్టార్ హీరోల భార్యలు కూడా అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అంటే నమ్మండి. ఇంటి దగ్గర  ఉండటం కాదు.. బయటికి వచ్చి వాళ్ళ టాలెంట్ లను నిరూపించుకుంటున్నారు. వాళ్లకు నచ్చిన పని చేసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు.
భర్తలకు మేము  తక్కువ కాదు అని అంటున్నారు. నాని భార్య ఇందులో అందరికంటే ముందుంది. అంజనా సంపాదన నాని  సంపాద కంటే తక్కువేం కాదు. అంజనా  కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేస్తుంది. బెంగళూర్ నిఫ్ట్ కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణ కూడా పూర్తి చేసింది అంజనా.. ప్రస్తుతం రాజమౌళి ఆర్కా మీడియాలో పని చేస్తుంది. ఆర్కా మీడియాలో క్రియేటివ్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పని  చేస్తుంది అంజన. బాహుబలి సినిమాకు కూడా అంజనా క్యాస్ట్యూమ్స్ డిజైనర్ గా చేసింది.
అల్లరి నరేష్ భార్య విరూప కూడా బాగా  సంపాదిస్తున్నారు. ఆమె ఈవెంట్ మానేజర్‌గా పని చేస్తున్నారు. ఒక్కో ఈవెంట్ కు  లక్షల్లో తీసుకుంటున్నారు విరూప. ఇక బుల్లి తెర యాంకర్ సుమ కూడా భర్త రాజీవ్ కంటే ఎక్కువగా  సంపాదిస్తుంది. ఈమె సంపాదన గురించి ప్రత్యేకంగా డిబేట్స్ కూడా అవసరం లేదు. కంటి ముందు కనిపిస్తుంది కాబట్టి. యాంకర్‌గానే కాకుండా ప్రస్తుతం యూ ట్యూబ్ ఛానెల్ కూడా మొదలు పెట్టింది సుమ.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి కూడా అందరికీ ఆదర్శంగా నిలబడుతున్నారు. పెళ్లై ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత కూడా తన ఉద్యోగం మానుకోలేదు. ప్రస్తుతం స్పెక్‌ట్రం అనే మ్యాగజీన్‌కు ఛీఫ్ ఎడిటర్‌గా చేస్తున్నారు స్నేహా. ఫారెన్‌లో చదువుకున్న ఈమె ఇప్పుడు జాబ్ చేస్తుంది. మరోవైపు తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్స్  కూడా చూస్తుంది స్నేహ