ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ చంద్రబాబే గెలుస్తాడనే సంగతి కెసిఆర్ కి అర్ధమైనట్టు ఉంది, చంద్రబాబుని ఎదుర్కోవడం అంత తేలిక కాదనే విషయం కెసిఆర్ కి ఎన్నికల నిర్వహణలోనే స్పష్టంగా అర్ధమైంది. ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకునే ప్రయత్నాలు చేసినా అవి ఎంతవరకు ఫలించాయి వారికే స్పష్టత లేదు. చివరి వరకు ఓటింగ్ శాతాన్ని నిలువరించాలి అని చేసిన ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొట్టటంతో ప్రజల అభీష్టం వారికి అర్థమైంది. ఇక పోలింగ్ అనంతరం వస్తున్న నివేదికలతో చంద్రబాబు గెలుస్తారనే విషయం స్పష్టమైంది. రాష్ట్రంలో చంద్రబాబు గెలిస్తే మాత్రం కేంద్రంలో ఆయన హవా పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ప్రత్యేక౦గా చెప్పాల్సిన పని లేదు. దీనితోనే కెసిఆర్ చంద్రబాబుతో సంధి కోసం చూస్తున్నారనే సంచలన విషయాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే మోడీ దేశంలో తిరిగి అధికారం చేపట్టే అవకాశాలు నూటికి నూరు పాళ్ళు లేవనే చెప్పాలి. ఓడిపోయే వైపు ఉండటానికి రాజకీయ నాయకులు పెద్దగా ఇష్టపడరన్న సంగతి మనకి తెలిసిందే. కెసిఆర్ కి కేంద్ర ప్రభుత్వంతో చాలా అవసరాలు ఉన్నాయన్న విషయం రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా అర్ధం అవుతుంది. దీనితో కెసిఆర్ కూడా పక్కకు తప్పుకోవాలని చూస్తున్నా అవి అంతగా ఫలించడం లేదని సమాచారం. ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబు తనను తిడుతున్నా కెసిఆర్ మాత్రం మౌనంగానే ఉన్నారు. ఒకటి రెండు సార్లు మినహా ఆయన పెద్దగా ఆరోపణలు చేసిన సందర్భాలు కూడా లేవనే చెప్పాలి. ఇక తాజాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తిరుపతి వెళ్ళనని చెప్పిన చినజీయర్ స్వామి స్వయానా వచ్చి చంద్రబాబుని కలిశారు. కెసీఆర్ సాష్టాంగ నమస్కారం చేసిన వ్యక్తి చినజీయర్. ఆయన వచ్చి చంద్రబాబుని కలవటంతో రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని అనుమానాలని రేకెత్తించిందని చెప్పవచ్చు. ఇదే విషయం పై నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది.