ఏపీ మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయిడు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షను ఏపీ ప్రజల్ని ఎమోషన్ లోకి తీసుకెల్లడానికి ప్రారంబించారు. ధర్మ పోరాట దీక్ష కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వైనం సంచలనంగా ఉండగా ఖర్చు లెక్కకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లాకి చెందిన సూర్యనారాయణ రాజు అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు హైకోర్టులో సమర్పించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ ఇంకా న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఈ కేసుపై ఫైర్ అవుతూ వ్యాఖ్యలు చేశారు.
ఇంత పెద్ద మొత్తాన్ని ఏచట్టం కింద విడుదల చేశారు అని 10కోట్ల రూపాయలు ఒక రోజు దీక్ష కోసం ఖర్చు చేశారా అని ప్రశ్నించింది. ప్రజాధనాన్ని వృథా చేస్తూ నిధుల్ని విడుదల చేసిన అధికారులు ఎవరని ప్రశ్నించింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం బాబు ధర్మపోరాట దీక్ష చేశారని..పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్లు పిటిషన్ దారు ఆరోపించారు.
ఒక్కరోజు దీక్షకు10 కోట్ల రూపాయలు అని పిటీషన్ తరఫు న్యాయవాది అనగానే ధర్మాసనం అంత ఖర్చా అని ప్రశ్నించి పన్ను రూపంలో ప్రజల వద్ద వసూలు చేసింనదే అని రాజకీయ కార్యక్రమాల కోసం ప్రజాధనాన్ని విడుదల చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ ఉండి అని అడిగింది. సంబంధించిన అన్ని వివరాల్ని సమర్పించాలి ఈ విషయం పైన విచారణను నవంబర్ 21న వాయిదా వేసింది.