ఏపీ రాజధాని అమరావతి తరలింపుపై హైకోర్ట్ కీలక ప్రకటన చేసింది. రాజధాని తరలింపు విషయంపై హైకోర్ట్ జోక్యం చేసుకోబోదని తేల్చి చెప్పింది. అయితే రాజధాని తరలింపుపై అత్యవసర విచారణ జరపాలని లాయర్ సుబ్బారావు హైకోర్ట్‌లో పిటీషన్‌ను దాఖలు చేశారు. అయితే ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్ట్ రాజధానిపై ఏపీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అందుకే ఈ విషయంలో కోర్ట్ జోక్యం తగదని చెప్పింది.
అంతేఅకాదు రాజధాని తరలింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదని, ఎలాంటి విధాన పరమైన నిర్ణయం కూడా ప్రకటించలేదని అలాంటప్పుడు దీనిపై ఎలా జ్యోకం చేసుకోగలమని పిటీషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. రాజధాని తరలించడం ఒక్క రోజులో పూర్తయ్యే పని కాదని, దీనిపై అత్యవసర విచారణ జరపవలసిన అవసరం లేదని కోర్ట్ తెలిపింది. రాజధానిపై లాయర్ సుబ్బారావు దాఖలు చేసిన పిటిషన్ తోపాటు మరికొన్ని పిటిషన్లను కూడా కొట్టివేస్తున్నట్లు హైకోర్టు బెంచ్ ప్రకటించింది.